వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ఢిల్లీ వెళ్లనున్న కోమటి రెడ్డి .. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ?

|
Google Oneindia TeluguNews

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా ? అందుకే ఆయన నేడు ఢిల్లీ వెళ్ళనున్నారా ? రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెయ్యబోతున్నారు ? పార్టీలో వినిపిస్తున్న చర్చ ఏంటి ? బీజేపీ వైపు చూస్తున్న నాయకులు ఇంకా ఎవరైనా ఉన్నారా ? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతోంది.

కాంగ్రెస్ కు టెన్షన్ పుట్టిస్తున్న కోమటి రెడ్డి.. పదవుల కోసమేనా నేతల పంచాయితీకాంగ్రెస్ కు టెన్షన్ పుట్టిస్తున్న కోమటి రెడ్డి.. పదవుల కోసమేనా నేతల పంచాయితీ

రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి కమలదళంలో చేరే అవకాశం నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో జూన్ 17వ తేదీ సోమవారం ఢిల్లీ వెళ్లనున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి కమలదళంలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది . కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని , కానీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే విషయంలో అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వంలో మార్పు లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదన్న నిర్ణయానికి వచ్చారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ దానిపై అధిష్టానం స్పందించలేదు . ఇక ఈ నేపధ్యంలోనే ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కారు . దేశప్రజలంతా బీజేపీ, ప్రధాని మోదీ వైపు చూస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. ఇక దీంతో ఆయన పార్టీ మారతారనే భావన తెరమీదకు వచ్చింది.

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో జూన్ 17వ తేదీ సోమవారం ఢిల్లీ వెళ్లనున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి కమలదళంలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది .

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని , కానీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే విషయంలో అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వంలో మార్పు లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదన్న నిర్ణయానికి వచ్చారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ దానిపై అధిష్టానం స్పందించలేదు . ఇక ఈ నేపధ్యంలోనే ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కారు . దేశప్రజలంతా బీజేపీ, ప్రధాని మోదీ వైపు చూస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. ఇక దీంతో ఆయన పార్టీ మారతారనే భావన తెరమీదకు వచ్చింది.

నాయకత్వ లోపమే తెలంగాణలో కాంగ్రెస్ఫెయిల్యూర్ కు కారణం అన్న రాజగోపాల్ రెడ్డి

నాయకత్వ లోపమే తెలంగాణలో కాంగ్రెస్ఫెయిల్యూర్ కు కారణం అన్న రాజగోపాల్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో నాయకత్వం లోపమే తెలంగాణా కాంగ్రెస్ బలహీనపడటానికి కారణం అని , కాంగ్రెస్‌ అధినాయకత్వం తెలంగాణ ఇచ్చినా తెలంగాణా ప్రజలు ఆదరించకపోవటానికి నాయకత్వ లోపమే కారణం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం మార్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం కాంగ్రెస్‌ వల్ల కాదన్న భావనకు వచ్చిన ఆయన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమన్న గట్టి నిర్ణయానికి వచ్చారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి కమలదళంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయ్యబోతున్నారో తేలేది నేడే ..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయ్యబోతున్నారో తేలేది నేడే ..

నేడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ కానున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరతారా లేదా అనేది తెలియాల్సి వుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీనపడింది. ఇక తెలంగాణలో నాయకత్వ లోపంతో దుస్థితిని ఎదుర్కొంటుంది అన్న భావనలో ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆయనతో పాటు మరికొంత మంది నాయకులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగ్గారెడ్డి తో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి . ఏది ఏమైనా కాంగ్రెస్ కు అటు టీఆర్ ఎస్ , ఇటు బీజేపీ కూడా పక్కలో బల్లెమై కూర్చున్నాయి.

English summary
Munugodu MLA and Congress Senior MLA Komatireddy Rajagopal Reddy raked controversy after making scandalous statements about his own party.But today, he made headlines once again after making a phone call to Sangareddy MLA Jaggareddy. Sources revealed that both the Congress leaders only talked about current scenario in the party but the incident raised several eyebrows in the political circle especially after yesterday’s comments.Talk in the political circle is that the Manugodu MLA was expecting TPCC Chief position and he pulled this stunt after being rejected. Some also claim that the Congress leader is giving hints of his shifting to BJP. The campaign is gaining momentum as Congress leader Komatireddy Rajagopal Reddy's is changing party. Congress MLA Komatireddy Rajagopal Reddy is going to delhi today to meet amith shah.. if Rajagopal Reddy joins the BJP, what is Komatireddy Venkatara Reddy going to do and What is the debate going on in the party ? Are there any more leaders looking towards BJP? That is now tensioning the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X