వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ హత్యకు బజ్జీల బండి వివాదమే కారణమా?: వారివల్లేనంటూ భార్య లక్ష్మి, ‘అధికార పార్టీ హస్తం’

|
Google Oneindia TeluguNews

Recommended Video

కోమటిరెడ్డి అనుచరుడి దారుణ హత్య, మురికికాల్వలో శవం : అధికార పార్టీ హస్తం

నల్గొండ: నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఘటనపై మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ నేతలే తన అనుచరుణ్ని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.

గురువారం ఉదయం మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వారింటికి వెళ్లిన కోమటిరెడ్డి శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ కారణంగా నల్గొండ పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి.

మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త దారుణ హత్య, మురికికాల్వలో పడేశారు, ఏడ్చిన కోమటిరెడ్డిమున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త దారుణ హత్య, మురికికాల్వలో పడేశారు, ఏడ్చిన కోమటిరెడ్డి

అర్ధరాత్రి హత్య

అర్ధరాత్రి హత్య

నల్గొండ సావర్కర్ నగర్‌లో బుధవారం అర్థరాత్రి తన ఇంటికి సమీపంలోనే శ్రీనివాస్‌ హత్యకు గురయ్యారు. ఐదుగురు దుండగులు ఆయన తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. ఘటనాస్థలిని ఎస్పీ సందర్శించి వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోలీసులు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

బైఠాయించిన కోమటిరెడ్డి.. జిల్లా బంద్‌కు పిలుపు

బైఠాయించిన కోమటిరెడ్డి.. జిల్లా బంద్‌కు పిలుపు

కాగా, శ్రీనివాస్ హత్యపై రాజకీయ ప్రమేయముందని ఆరోపిస్తూ... కాంగ్రెస్ శ్రేణులు జిల్లా బంద్‌ చేపట్టాయి. మార్చూరీలోని శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి... అనంతరం నల్గొండ క్లాక్ టవర్ సర్కిల్‌లో ప్రధాన రహదారిపై బైఠాయించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.

అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ

అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ

శ్రీనివాస్ హత్య ఘటనలో అధికార పార్టీ నేతల హస్తముందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇందుకు తనవద్ద సాక్ష్యాలున్నాయని తెలిపారు. ఛైర్ పర్సన్ దంపతులకు ప్రాణపాయం ఉందని భద్రత కోరినా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

పరారీలో ప్రధాన నిందితులు

పరారీలో ప్రధాన నిందితులు

కాగా, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే హత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులు... ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భర్త హత్యకు గురవడంతో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బజ్జీల బండి వివాదమే హత్యకు దారితీసిందా?

బజ్జీల బండి వివాదమే హత్యకు దారితీసిందా?

అయితే, బజ్జీల బండి వ్యవహారమే ఘటనకు ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో... బజ్జీల బండి నిర్వాహకుడితో పాటు మరో కౌన్సిలర్ సహా అయిదుగురు వ్యక్తులు.. శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. బజ్జీల బండి నిర్వాహకుడికి, మరో వ్యక్తికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడగా వారిద్దరూ స్థానిక కౌన్సిలర్‌ను ఆశ్రయించారు. కౌన్సిలర్ వద్ద సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన సూచనలతోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనకు జరిగిన ఘటనను వివరించినట్లు తెలుస్తోంది.

హత్యపై అనుమానాలు

హత్యపై అనుమానాలు

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు తద్వారా ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇందులో మరో కోణాన్ని కూడా జోడిస్తున్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్యకు శ్రీనివాస్ యత్నిస్తుండగానే... అనుకోకుండా కొందరు వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారన్న వాదనలూ వినపడుతున్నాయి. అయితే ఈ హత్య ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితులు నోరు విప్పితే గానీ హత్య గల కారణం తెలిసే అవకాశం లేదు.

నిందితులు వీరే.. పోలీసులపై శ్రీనివాస్ రెడ్డి భార్య మండిపాటు

నిందితులు వీరే.. పోలీసులపై శ్రీనివాస్ రెడ్డి భార్య మండిపాటు


శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసిన అనంతరం లొంగిపోయిన నిందితుల్లో కత్తల చక్రి, దుర్గయ్య, మాతంగి, మోహన్, గోపీ ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్‌లు పరారీలో ఉన్నారు. కాగా, పోలీసుల తీరుపై మున్సిపల్ చైర్ పర్సన్, శ్రీనివాస్ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఫోన్ రాగానే శ్రీనివాస్ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. గన్ లైసెన్స్ ఇవ్వమని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్తను కోల్పోయానని లక్ష్మీ కన్నీళ్లపర్యంతమయ్యారు.

English summary
Congress MLA Komatireddy Venkata Reddy on Thursday fired at TRS government in Boddupalli Srinivas murder issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X