వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొట్టుకుంటారు: కెటిఆర్‌, హరీష్‌లపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కెటి రామారావు, హరీష్ రావులపై కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్కు నాలుగు ఓట్లు పడేదుంటే అది మంత్రి హరీష్ రావు వల్ల మాత్రమేనని ఆయన అన్నారు.

హరీష్ రావు ఇంట్లో ఫంక్షన్ ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, ఐటి మంత్రి కావాలనే వెళ్లలేదని ఆయన అన్నారు ఆ సమయంలో బెంగళూరు వెళ్లి సినిమా చూసి వచ్చాడని ఆయన అన్నారు.

 కేసీఆర్ లేకపోతే...

కేసీఆర్ లేకపోతే...

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే బావ, బావమరుదులు (హరీష్ రావు, కెటిఆర్) రోడ్డెక్కి కొట్టుకునే పరిస్తితి వస్తుందని కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు.

ఆయనకు అడ్రస్ ఉండదు..

ఆయనకు అడ్రస్ ఉండదు..

ఆరు నెలల తర్వాత మంత్రి జగదీష్ రెడ్డికి అడ్రస్ ఉండదని కోమటిరెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఫాక్షన్ సిఎంగా ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు.

అలా అనడం అవగాహనారాహిత్యం

అలా అనడం అవగాహనారాహిత్యం

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్ డేటా టైప్ చేసి తీసుకుని వచ్చామని మంత్రి జగదీష్ రెడ్డి అనడం అవగాహనా రాహిత్యమని కోమటిరెడ్డి అన్నారు గాలివాటంగా జగదీష్ రెడ్డి మంత్రి అయ్యారని అన్నారు. ఆ కాల్ డేటా తప్పయితే ఈ పాటికే పోలీసులు చర్యలు తీసుకుని ఉండేవాళ్లని, తాము బాధలో ఉంటే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

నీ పాత్ర లేకపోతే ఇలా చేయి...

నీ పాత్ర లేకపోతే ఇలా చేయి...

శ్రీనివాస్ హత్య కేసులో జగదీష్ రెడ్డి పాత్ర లేకపోతే కేసీఆర్‌ను ఒప్పించి కేసును సిబిఐకి సిఫార్సు చేయించాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని, తనపై కేసులు ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.

 నాలుగు వేల ఓట్లు కూడా..

నాలుగు వేల ఓట్లు కూడా..

ఈసారి మంత్రి జగదీష్ రెడ్డికి నాలుగు వేల ఓట్లు కూడా పడవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు వైస్ ఎంపిపి మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో జగదీష్ రెడ్డి ఎ2 నిందితుడన, నూకా బిక్షం, కడారి రామిరెడ్డి హత్య కేసుల్లో నిందితుడని ఆయన అన్నారు. మద్య నిషేధం సమయంలో మద్యం అమ్ముతుంటే జగదీష్ రెడ్డిపై కేసు నమోదయందని ఆయన ఆరోపంచారు.

English summary
Congress MLA Komatireddy Venkat Reddy made serious comments against Telangana ministers Harish Rao and KT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X