వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా వ్యాపారులతోనే: కెసిఆర్‌పై కోమటిరెడ్డి, అలక.. శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సోమవారం మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం ఆంధ్రా వ్యాపారులు, రియాల్టర్ల కనుసన్నుల్లోనే నడుస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను బెదిరించి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పాలన తుగ్లక్ పాలనతో సమానమని మండిపడ్డారు.

 Komatireddy Rajagopal Reddy blames KCR

శ్రీనివాస్ గౌడ్ మరో'సారీ'

మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి చేపట్టానని చెప్పారు.

అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆయన వాపోయారు. ఎమ్మెల్యేగా తాను, శాసనమండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ ఉన్నప్పటికీ తమకు ఎలాంటి సంతోషం లేదని చెప్పారని తెలుస్తోంది.

ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారు ఎక్కడో ఉన్నారని, మధ్యలో వచ్చిన వారు మాత్రం పార్టీలో ముందు వరుసలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సభలో ఆయన మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

English summary
Former MP Komatireddy Rajagopal Reddy blames KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X