వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌లో చేరకపోతే కేసులు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాసనమండలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు.అధికార పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనంకాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం

శాసనండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం నాడు ఈ ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తీవ్రంగా ఖండించారు.

రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, శాంతి భద్రతల నిర్వహణపై శాసనమండలిలో మంగళవారం నాడు చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కెసిఆర్ పోటీ చేసినా గెలుపు నాదే, రాజకీయాల నుండి తప్పుకొంటా: కోమటిరెడ్డి సంచలనంకెసిఆర్ పోటీ చేసినా గెలుపు నాదే, రాజకీయాల నుండి తప్పుకొంటా: కోమటిరెడ్డి సంచలనం

టిఆర్ఎస్‌లో చేరకపోతే కేసులు

టిఆర్ఎస్‌లో చేరకపోతే కేసులు

టిఆర్ఎస్‌లో చేరకపోతే కేసులు పెడతామని బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులను తమకు అనుకూలంగా పనిచేసేందుకు ఉపయోగించుకొంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే చెప్పినట్టు వినకపోతే బదిలీలు

ఎమ్మెల్యే చెప్పినట్టు వినకపోతే బదిలీలు

స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాల్సిన పరిస్థితులు పోలీసులకు ఉన్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినని పోలీసు అధికారులను బదిలీ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒత్తిడి భరించలేక సెలవు పెట్టి వెళ్తామని అనేకమంది పోలీసులు చెబుతున్నారని ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

కోమటిరెడ్డి ఆరోపణలకు నాయిని కౌంటర్

కోమటిరెడ్డి ఆరోపణలకు నాయిని కౌంటర్


ఈ చర్చలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకొన్నారు. తమ పార్టీకి లక్షలాది మంది సభ్యులున్నారని హోమ్ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు. ఇతర పార్టీల నుంచి తాము వలసలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని నాయిని చెప్పారు.

 కోమటిరెడ్డి విమర్శలపై చర్చ

కోమటిరెడ్డి విమర్శలపై చర్చ

దేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి పేరుంది. ఏ కేసునైనా టెక్నాలజీ సహయంతో సులభంగా పరిష్కరిస్తున్నారనే పేరుంది. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఏరివేతలో దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసులు తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి విమర్శలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

English summary
MLC Komatireddy Rajagopal Reddy made allegations on TRS governament. Komatireddy Rajagopal Reddy participated discussion on police department in Council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X