వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నకు తోడుగా వచ్చాడట... పార్టీ మారేందుకు కాదట ...ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయోనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ తాను ఢిల్లీకి వెళ్లింది. పార్టీ మారేందుకు కాదని స్పష్టం చేశారు. అయితే నిన్న బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఢిల్లి పయనమైన ఆయన బీజేపీలో చేరుతారనే ఉహగానాలు ఊపందుకున్నాయి.అయితే ఆయన మాత్రం తాను బీజేపీలో చేరేందుకు ఎవ్వరిని కలవలేదని స్పష్టం చేశారు.పార్టీ మారను... రాజగోపాల్ రెడ్డీ

komatireddy rajagopl reddy has announced that no party change

పార్టీ మారను... రాజగోపాల్ రెడ్డీ

బీజేపీలో చేరేందుకే మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లారనే వార్తలు జోరుగా ఊపందుకున్నాయి.అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అన్న వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందు వల్లే ఢిల్లీ చేరుకున్నానని తెలిపారు. ఇక ఉదయం నుండి పార్లమెంట్‌లోనే ఉన్నానని, తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. బీజేపీ నేతలను ఎవ్వరిని కలవ లేదని తెలిపారు.ఒకవేళ మారే పరిస్థితి వస్తే మాత్రం కార్యకర్తలు కుటుంభ సభ్యులతో కలిసే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన పార్టీ

ఇక రాజగోపాల్ రెడ్డీ పార్టీ మారతారనే సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడ స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. దీంతో ఆయనకు ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చేప్పాలంటూ షో నోటీసులు సిద్దం చేసింది. నోటీసును పరీశీలించేందుకు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియాకు పంపింది.

మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పై ఫైర్

ఓవైపు ఇదివరకే చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారి చేసేందుకు సిద్దమైనా...రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈనేపథ్యంలో
మరోసారి పార్టీ హైకమాండ్ తోపాటు రాష్ట్ర్ర పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర్ర నాయకత్వం సరిగా లేకనే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉందని లీడర్‌షిప్ ప్రభావం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. పార్టీ వైఫల్యం వల్లే కేసిఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని తెలిపారు.ఇక కేంద్రంలో కూడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణ ఇచ్చికూడ అధికారం చేజిక్కుంచుకోకపోవడం పార్టీ నేతల వైఫల్యమేనని అని విమర్శించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పార్టీ మారరు జగ్గారెడ్డి,

ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారని అయితే ప్రస్థుత పరిస్థితుల్లో అటు బీజేపీలో గాని,ఇటు టీఆర్ఎస్‌లో గాని ఎవరు చేరే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇక పార్టీ కార్యకర్తల్లో ఎలాంటీ గందరగోళం లేదని, కాని నాయకుల్లో మాత్రమే గందరగోళం కనిపిస్తుందని ఆయన అన్నారు. అయితే తనతో రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలను వెళ్లడించనని అన్నారు.

English summary
telangana congress mla komatireddy rajagopl reddy has announced that no party change.he cleaerd that he came to attend the delhi to see his brother venkatreddy sworn in cermoney in parlament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X