• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్‌ రెడ్డిపై తగ్గని కోమటిరెడ్డి-చిన్నపిల్లాడు..ఆ పేరు ఎత్తొద్దు-అంత సీన్ పార్టీలో ఎవరికీ లేదంటూ....

|

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా గుర్రుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేజారినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన... ఇప్పట్లో మెత్తబడేలా కనిపించట్లేదు. కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌పై ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాకతో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని ఓవైపు ఆ పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తుంటే... మరోవైపు కోమటిరెడ్డి మాత్రం అంత సీన్ లేదన్నట్లుగానే మాట్లాడుతున్నారు.

'చిన్నపిల్లగాడు... ఆ పేరు ఎత్తొద్దు..'

'చిన్నపిల్లగాడు... ఆ పేరు ఎత్తొద్దు..'

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించగా ఆయన గురించి మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు. 'చిన్నపిల్లగాడి పేరు నా దగ్గర తీయొద్దు...' అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రేవంత్‌ విషయంలో ఆయన ఇప్పటికీ తీవ్ర అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కిన సమయంలోనూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సిఫారసు మేరకే రేవంత్‌కు పదవి దక్కిందని... రూ.25కోట్లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. కొత్తగా ఎంపికైన కార్యనిర్వహక వర్గం ఎవరూ తనను కలవొద్దని చెప్పారు. ఇప్పటివరకూ వారిని తన దగ్గరికి రానివ్వలేదు కూడా.

పార్టీలో ఆ స్థాయి ఎవరికీ లేదు.. : కోమటిరెడ్డి

పార్టీలో ఆ స్థాయి ఎవరికీ లేదు.. : కోమటిరెడ్డి

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో తనతో సహా రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకుడు ఎవరూ లేరని కోమటిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. ఖమ్మంలో,నల్గొండలో,మల్కాజ్‌గిరిలో ఇలా ఎక్కడా పార్టీ ప్రభావం చూపలేకపోయిందన్నారు. కాబట్టి కొత్త కార్యానిర్వహక వర్గంతో పాటు మిగతా కాంగ్రెస్ నేతలంతా ఎవరి నియోజకవర్గంలో వారు గెలవడంపై ఫోకస్ చేయాలని సూచించారు. గతంలోనూ కోమటిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎంపికైన నాయకులు గాంధీభవన్‌లో స్పీచ్‌లకు పరిమితం కాకుండా ఎవరి నియోజకవర్గాల్లో వారు పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలన్నారు. అంతేకాదు,కొత్తగా నాయకత్వ బాధ్యతలు చేపట్టినవారు హుజురాబాద్‌ ఉపఎన్నికలో డిపాజిట్ సంపాదించి చూపెట్టాలని సవాల్ విసిరారు.

  Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
  పీసీసీ చీఫ్ నా స్థాయికి చాలా చిన్న పోస్ట్ : కోమటిరెడ్డి

  పీసీసీ చీఫ్ నా స్థాయికి చాలా చిన్న పోస్ట్ : కోమటిరెడ్డి

  రేవంత్ రాకతో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని ఓవైపు ఆ పార్టీ శ్రేణులు భావిస్తుంటే... కోమటిరెడ్డి వ్యాఖ్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎవరి నియోజకవర్గాన్ని వారు చూసుకుంటే బెటర్... రాష్ట్రం మొత్తం కాంగ్రెస్‌ను గెలిపించే సత్తా ఉన్న నాయకుడు ప్రస్తుతం పార్టీలో ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. తద్వారా రేవంత్ నాయకత్వంపై తనకు పెద్దగా నమ్మకం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెబుతున్నారేమో అనిపిస్తోంది. కాంగ్రెస్‌ను వీడనని చెబుతూనే... పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కోమటిరెడ్డి మెత్తబడకపోరా అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు గమనిస్తే ఇప్పట్లో ఆయన తగ్గేలా కనిపించట్లేదు. ఇక పీసీసీ చీఫ్ పదవి తన స్థాయికి చాలా చిన్న పోస్టు అని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు.

  English summary
  After meeting Union Minister Kishan Reddy, Komatireddy Venkat Reddy spoke to the media. When media representatives asked about new tpcc chief Revanth Reddy, he was reluctant to talk about him.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X