వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడుకు కోమటిరెడ్డి దూరం - రేవంత్ ను ఫిక్స్ చేసేలా..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..మునుగోడులో పాదయాత్రలు - బహిరంగ సభలకు ప్లాన్ లు సిద్దం చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అంతర్గత వివాదాలు ఇప్పుడు మునుగోడు సమయంలో మరోసారి తెర మీదకు వస్తున్నాయి. రేవంత్ తీరు పైన తొలి నుంచి గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మునుగోడు వ్యవహారం లో దూరం పాటిస్తున్నారు.

మునుగోడుకు వెంకటరెడ్డి దూరమేనా

మునుగోడుకు వెంకటరెడ్డి దూరమేనా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అక్కడ పార్టీకి మద్దతుగా..కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యవం వహిస్తున్న భువనగిరి లోక్ సభ పరిధిలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అదే సమయంలో సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం వెంకరెడ్డికి ఇబ్బందిగా మారింది. దీనిని అవకాశం గా మలచుకొని వెంకటరెడ్డిని ఫిక్స్ చేసేందుకు రేవంత్ వర్గం ప్రయత్నాలు చేసింది. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు విషయంలో తన సోదరుడి రాజగోపాల్ పార్టీ మారటం పైన ఆచి తూచి స్పందించారు. పార్టీ మారటం రాజగోపాల్ వ్యక్తిగత వ్యవహారమని చెబుతూనే.. రేవంత్ వ్యాఖ్యల పైనే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆ తరువాత రేవంత్ తన వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇచ్చారు.

Recommended Video

Munugodu లో Congress అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే *Telangana | Telugu OneIndia
కీలక సమావేశాలకు ఆహ్వానం లేదంటూ

కీలక సమావేశాలకు ఆహ్వానం లేదంటూ

ఇక, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ నిర్వహించిన సమీక్షకు తనకు ఆహ్వానం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏ సమావేశం జరిగినా తనకు సమాచారం ఇవ్వటం లేదని చెప్పుకొచ్చారు. చండూరు సభలో తనను అసభ్యంగా తిట్టించారని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతానని అనుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని విషయాలు పార్టీ అధినాయకత్వం సోనియా - రాహుల్ తో మాట్లాడుతానని చెప్పారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మునుగోడు సమావేశాలకు ఆహ్వానించకపోవటాన్ని..కోమటిరెడ్డి అనకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

హైకమాండ్ కు ఫిర్యాదుకు సిద్దం

హైకమాండ్ కు ఫిర్యాదుకు సిద్దం


మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టు ఉంది. అక్కడ రాజగోపాల్ బీజేపీ నుంచి గెలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంకరెడ్డి అడ్డుకోవాల్సిన పరిస్థితుల నుంచి రిలీఫ్ దొరికినట్లుగా భావిస్తున్నారు. మునుగోడులో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులోనూ వెంకటరెడ్డి పాల్గొనే అవకాశం లేదు. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ప్రచారం తారా స్థాయికి చేరనుంది. ఆ సమయానికి కోమటిరెడ్డికి కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయక తప్పని పరిస్థితులు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికైతే పరోక్షంగా రేవంత్ కారణంగానే తాను మునుగోడు వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.

English summary
MP Komatireddy Venkata Reddy maintaining distance with Munugodu by poll issue and congress meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X