• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నా కోపం కేటీఆర్ పైనే, కేసీఆర్ 3 పనుల వల్ల ఢిల్లీలో పరువుపోయింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పైన, ఆ పార్టీ నేత కల్వకుంట్ల తారక రామారావు పైన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు.

కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని కొండా ప్రశ్నించారు. ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తెరాస అన్ని వర్గాలను మోసం చేసిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని ఆయన అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. తెరాస నుంచి చాలామంది బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

టైమ్స్ నౌ సర్వే: టీఆర్ఎస్‌కు 70 సీట్లు, చంద్రబాబు-రాహుల్ గాంధీలకు ప్రజల తిరస్కరణటైమ్స్ నౌ సర్వే: టీఆర్ఎస్‌కు 70 సీట్లు, చంద్రబాబు-రాహుల్ గాంధీలకు ప్రజల తిరస్కరణ

నా కోపం కేటీఆర్ పైనే

నా కోపం కేటీఆర్ పైనే

తన కోపం మహేందర్ రెడ్డి సోదరుల మీద కాదని, మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు పైన అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తాను ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. పార్టీలో పలువురు అసంతృప్తితో ఉన్నారని అభిప్రాయపడ్డారు.

 కేసీఆర్ చేసిన మూడు పనుల వల్ల ఢిల్లీలో తెరాస పరువుపోయింది

కేసీఆర్ చేసిన మూడు పనుల వల్ల ఢిల్లీలో తెరాస పరువుపోయింది

పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు అంటే చాలా గౌరవం ఉండేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ చేసిన మూడు పనుల కారణంగా రాష్ట్ర ఎంపీల పరువు గంగలో కలిసిపోయిందని చెప్పారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా ఆందోళన చేయాలని కేసీఆర్ సూచించారని, తాము ఆందోళనకు దిగితే కేంద్రమంత్రి తమను పిలిపించి.. ఏమయ్యా.. మీ సీఎం తెలంగాణ తరఫున దరఖాస్తు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారని, దాంతో తొలిసారి పరువు పోగొట్టుకున్నామని చెప్పారు.

మేం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాం

మేం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాం

ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించారని, ఓటింగ్ సమయంలో చల్లగా జారుకొని బయటకు వచ్చేయాలని సూచించారని, అందుకు అనుగుణంగా తాము గుట్టుగా బయటకు వచ్చే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయామని కొండా చెప్పారు. రాష్ట్రాల రుణాలను నియంత్రించే ఎఫ్ఆర్‌బీఎం సవరణ విషయంలోను కేసీఆర్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదన్నారు.

ఆంధ్రా ముఖ్యమంత్రులే బెట్టర్

ఆంధ్రా ముఖ్యమంత్రులే బెట్టర్

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను ఓడించే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న తెరాసకు ఓటమి తప్పదని చెప్పారు. కేసీఆర్ ఇప్పటి వరకు తమ ప్రాంతంలో అడుగు పెట్టలేదని కొండా చెప్పారు. ఆయన కంటే ఆంధ్రా ముఖ్యమంత్రులే బెట్టర్ అన్నారు.

కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేదు

కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేదు

ఈ ప్రభుత్వం హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కొండా చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సాగునీరు తెస్తామన్న కేసీఆర్ ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకంగా పేరు మార్చేశారన్నారు. అంతారం చెరువును కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు అందుకు శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. తెలంగాణలో కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోయిన కేసీఆర్, ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ చెబుతారని, కానీ దక్షిణ రంగారెడ్డి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి రాత్రి బస చేశారనీ, కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టలేదన్నారు. తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు విలయతాండవం చేస్తోందని చెప్పారు. మైనార్టీలకు నిధులను ఇవ్వకుండా మళ్లించారనీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్‌ను సరిగ్గా అమలు చేయలేదన్నారు.

రెండేళ్ల తర్వాత గాడి తప్పింది

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు తెలంగాణపై రూ.40,000 కోట్ల తెల్ల ఏనుగును మోపుతున్నారని కేసీఆర్ విమర్శించారని, అదే కేసీఆర్ ఇప్పుడు సీఎం కాగానే కొద్దిగా డిజైన్ మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.95,000 కోట్లకు తీసుకెళ్లారని కొండా ఆరోపించారు. తెలంగాణలో పుట్టిన బిడ్డ నుంచి పండుముసలి వరకూ ఒక్కొక్కరి నెత్తిపై రూ.61,000 అప్పును కేసీఆర్ మోపారన్నారు. ఇంట్లో నలుగురు ఉంటే రెండున్నర లక్షల అప్పు ఉన్నట్లే అన్నారు. బస్సులో జేబు కొట్టేసిన దొంగ టికెట్ డబ్బులు ఇచ్చినట్లు కేసీఆర్ వ్యవహారశైలి ఉందన్నారు. తొలి రెండేళ్లు అద్భుతంగా పాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత గాడి తప్పిందని చెప్పారు. గొర్రెలు, బర్రెలు, కల్యాణలక్ష్మి వంటి చిన్నచిన్న తాయిలాలు చూపుతూ ప్రజలపై కేసీఆర్ భారీగా రుణభారాన్ని మోపుతున్నారన్నారు.

English summary
Chevella MP Konda Vishweshwar Reddy blamed minister KT Rama Rao for his resignation from TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X