వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీకి మాటిచ్చా, ఈ క్షణం నుంచే కేసీఆర్‌కు మా సత్తా తెలుస్తుంది: కొండా సురేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/వరంగల్: వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో సురేఖ, ఆమె భర్త కొండా మురళీలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఐదు జిల్లాల్లో బలం పెరిగినట్లే. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చర్చించుకుంటున్నారు.

<strong>ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!</strong>ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!

రాహుల్ గాంధీ ఆహ్వానం

రాహుల్ గాంధీ ఆహ్వానం

కొండా సురేఖకు, కొండా మురళీలకు రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొండా దంపతులు తెరాసలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వరంగల్ టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Recommended Video

అన్నీ చూసుకుంటాన‌న్న కేసీఆర్ అంగ‌ట్లో ఒదిలేసాడని విమ‌ర్శ‌..!!
ఈ క్షణం నుంచే మా ప్రభావం తెలుస్తుంది

ఈ క్షణం నుంచే మా ప్రభావం తెలుస్తుంది

పార్టీలో చేరిన అనంతరం ఉత్తమ్, సురేఖ, మురళీలు మీడియాతో మాట్లాడారు. కొండా దంపతులు తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెరాసకు తెలుస్తుందని కొండా సురేఖ చెప్పారు. వరంగల్ జిల్లాలో దాదాపు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా మహాకూటమి అభ్యర్థులను గెలిపించుకొని తీసుకు వస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి మాటిచ్చానని, దానిని నిలబెట్టుకుంటామని చెప్పారు. మా ప్రభావం ఏమిటో తెరాసకు ఈ క్షణం నుంచే తెలుస్తుందని, బేషరతుగా తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పారు.

సీటు ఒక్కటే, పార్టీలో చేరాక ప్రాధాన్యత

సీటు ఒక్కటే, పార్టీలో చేరాక ప్రాధాన్యత

ఢిల్లీకి వెళ్లి వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి తదితరులు కొండా దంపతులతో పాటు ఉన్నారు. కాగా, కొండా సురేఖ తమకు మూడు స్థానాలు కోరుతున్నారు. కానీ మహా కూటమిలోని వివిధ పార్టీలకు సర్దుబాట్లు, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ పోటీ ఉండటంతో ఒక్క సీటు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ ఈస్ట్‌ను కొండా సురేఖకు ఇవ్వనున్నారు. వారు పార్టీలో చేరి బలోపేతం చేసిన తర్వాత మాత్రం వారికి మంచి ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలుస్తోంది.

ఆరు నియోజకవర్గాలు కాదు, ఆరు డివిజన్లలలోనే ప్రభావం ఉండదు

ఆరు నియోజకవర్గాలు కాదు, ఆరు డివిజన్లలలోనే ప్రభావం ఉండదు

కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని తెరాస నేతలు చెబుతున్నారు. ఆమె చెబుతున్నట్లు ఆరు నియోజకవర్గాల్లో కాదు కదా.. ఆరు డివిజన్లలో కూడా ప్రభావం ఉండదని చెప్పారు. కొండా దంపతులకు రాజకీయ బిక్ష పెట్టిందే కేసీఆర్ అన్నారు.

English summary
Konda Surekha and Konda Murali have joined Congress party in the presence of party chief Rahul Gandhi. Telangana Congress senior leaders Uttam Kumar Reddy, Shabbir Ali, Renuka Chowdhary, and others have accompanied the Konda couple in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X