వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చెయ్యమంటున్న కొండా దంపతులు ... కాంగ్రెస్ కు అభ్యర్థుల టెన్షన్

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్నికలను ఆపాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో టీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించింది . ఇక కాంగ్రెస్ ఎన్నికలను ఆపాలని ఒక పక్క ప్రయత్నం చేస్తూనే అభ్యర్థుల వేటలో పడింది.

నగేశ్‌పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీనగేశ్‌పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కొండా దంపతులు దూరం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కొండా దంపతులు దూరం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి బరిలోకి దిగుతారని భావించిన కొండా దంపతులు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తుంది . ఈ విషయమై తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలకు కూడా తెలియజేశారని టాక్ .ఈ నెల 14వ తేదీన నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు కావటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో ఉంది . ఒక పక్క టీఆర్ ఎస్ పార్టీ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి అవకాశం ఇవ్వగా , వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పరకాల ఇంచార్జీ వెంకట్రామిరెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్టే అని తెలుస్తుంది .

టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కొండా మురళి

టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కొండా మురళి

ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా మురళి పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. మళ్ళీ ఈ దఫా ఎన్నికల్లో కొండా దంపతులు పోటీకి ఉత్సాహం చూపిస్తారు అనుకుంటే అనూహ్యంగా వారు నో చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసి ఓటమి పాలైన తర్వాత మొన్న జరిగిన ఇంటర్మీడియట్ ఆందోళనలో మినహాయించి కొండా దంపతులు కనిపించిన దాఖలాలు లేవు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరాసక్తతకు కారణం ఇదేనా

కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరాసక్తతకు కారణం ఇదేనా

ఈ ఎన్నికలలో పోటీ చేస్తారు అనుకుంటే కొండా మురళి గానీ, సురేఖ కానీ ఆసక్తి చూపలేదని సమాచారం.మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రాజేందర్ రెడ్డి కూడ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సానుకూలంగా లేరని పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు స్థానిక పరిస్థితులు , రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పై తలపడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అనుకూలించే అంశం కాదన్న భావన వెరసి పోటీపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు.

English summary
The Konda couple who feel that they will come from Warangal district in the MLC elections are expected to stay away from the competition. Talking to the party leaders in this regard, so, Congress party is in the hunt for the last day of filing nominations on May 14. Pochampalli Srinivas Reddy was given a chance from TRS party. Congress party Warangal MLC candidate is known as the Parakala Incharge Venkatrami Reddy's name. Konda murali and surekha said NO to compete in this election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X