వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది బలుపు: రేవంత్ దుమ్ముదులిపిన కొండా సురేఖ, కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై

మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం శుక్రవారం మొదలైంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టు Konda Surekha May Join Congress | Oneindia Telugu

వరంగల్: మాజీ మంత్రి, వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం శుక్రవారం మొదలైంది. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు.

కేసీఆర్‌కు షాక్, అల్టిమేటం: కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టుకేసీఆర్‌కు షాక్, అల్టిమేటం: కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టు

కొండా సురేఖ ఏమన్నారంటే

కొండా సురేఖ ఏమన్నారంటే

తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నాననే ప్రచారం అంతా వట్టిదేనని కొండా సురేఖ కొట్టి పారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు.

మైండ్ గేమ్ ఆడుతున్నారు

మైండ్ గేమ్ ఆడుతున్నారు

పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై మైండ్ గేమ్ ఆడుతున్నారని సురేఖ ద్వజమెత్తారు. తమకు రాజకీయ జన్మను ఇచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డి అని, పునర్జన్మను ఇచ్చింది తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని స్పష్టం చేశారు. కడదాకా తాము తెరాసలోనే ఉంటామన్నారు.

రేవంత్ రెడ్డి వాపును బలుపు అనుకుంటున్నారు

రేవంత్ రెడ్డి వాపును బలుపు అనుకుంటున్నారు

టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని కొండా సురేఖ ఎద్దేవా చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే 2019లో కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పారు.

వలసలు ఉంటాయని చెప్పారు, కానీ

వలసలు ఉంటాయని చెప్పారు, కానీ

కాగా, ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పెద్ద ఎత్తున ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు కూడా చేరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పుడు కొండా సురేఖ పేరు వెలుగు చూసింది. అయితే ఇదంతా మైండ్ గేమ్ అని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

English summary
Former Minister and Warangal TRS MLA Konda Surekha on Friday condemned joining TRS. She fired at Revanth Reddy and TPCC chief Uttam Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X