వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికెట్ అడ్డుకుంది కేటీఆరే! ఆగం చేసేందుకే కోటరీ: కొండా సురేఖ, ‘ఇష్టం లేకున్నా హరీశ్ రావు’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన పేరును తొలి జాబితాలో ఎందుకు ప్రకటించలేదో టీఆర్ఎస్ అధిష్టానం సమాధానం చెప్పాలని వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

టీఆర్ఎస్‌కు షాకిస్తారా?: సొంత గూటికి కొండా సురేఖ!, ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ టీఆర్ఎస్‌కు షాకిస్తారా?: సొంత గూటికి కొండా సురేఖ!, ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ

24గంటల్లో సమాధానం రావాలి..

24గంటల్లో సమాధానం రావాలి..

శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొండా మురళితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తమ నిర్ణయాన్ని రెండు మూడు రోజుల్లో చెబుతామని కొండా సురేఖ చెప్పారు. 24గంటల్లో టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని గడువు విధించారు. తాము ప్రతి సమస్యను కేటీఆర్, హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

కేటీఆర్ ఆహ్వానిస్తే.. ఇష్టం లేకున్నా హరీశ్ రావే మద్దతిచ్చారు

కేటీఆర్ ఆహ్వానిస్తే.. ఇష్టం లేకున్నా హరీశ్ రావే మద్దతిచ్చారు

తనకు టికెట్ ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాల్సిందేనని కొండా సురేఖ అన్నారు. ఈ విషయంపై తెల్లారి నుంచి కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్పారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం హరీశ్ రావుకు ఇష్టం లేదు కానీ, పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కంటే.. కూడా ఆయనే కొంత మద్దతుగా ఉన్నారని చెప్పారు.

 టికెట్ రాకుండా అడ్డుకుంది కేటీఆరే..

టికెట్ రాకుండా అడ్డుకుంది కేటీఆరే..


తమకు టికెట్ రాకుండా అడ్డుకుంది కేటీఆర్ అని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆరే అంత నడిపిస్తున్నారని అన్నారు. సురేష్ రెడ్డి లాంటి వ్యక్తులకు కూడా ఇప్పడు తనకు ఎదురైన అనుభవమే ఎదుర్కోక తప్పదని అన్నారు.

టికెట్ రాకుంటే.. మూడు స్థానాల్లో పోటీ చేస్తాం..

టికెట్ రాకుంటే.. మూడు స్థానాల్లో పోటీ చేస్తాం..

తాము పార్టీ మారితే అందరికీ చెప్పే మారతామని కొండా సురేఖ స్పష్టం చేశారు. తమకు టికెట్ రాకుంటే స్వాంత్రత్య అభ్యర్థులుగా తమ కుటుంబ సభ్యులు మూడు స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. వరంగల్, తూర్పు పరకాల, భూపాలపల్లి స్థానాల నుంచి పోటీ చేస్తామని అన్నారు.

తెలంగాణను ఆగం చేసేందుకే కేటీఆర్ కోటరీ..

తెలంగాణను ఆగం చేసేందుకే కేటీఆర్ కోటరీ..

తాము టీఆర్ఎస్ పార్టీని వీడితే ఆ పార్టీకే నష్టం కానీ, తమకు కాదని కొండా సురేఖ స్పష్టం చేస్తారు. ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తున్నారని కొండా సురేఖ ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఎందుకిస్తున్నారని నిలదీశారు. వీరందరికీ టికెట్లు ఇచ్చి కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఆగం చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

English summary
Warangal East former MLA Konda Surekha on Saturday fired at TRS leaders KTR and TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X