• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేటీఆర్.. శంకుస్థాపనలు చేస్తే ప్రజలు నిన్ను నీ అయ్యని నమ్ముతారా? తిట్టిపోసిన కొండా సురేఖ

|
Google Oneindia TeluguNews

మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటనను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన కొండా సురేఖ వరంగల్ లో ఎక్కడ అభివృద్ధి చేశారో కేటీఆర్, కేసీఆర్ లు చూపించాలని సవాల్ విసిరారు.

నయవంచన పునర్ స్థాపన! మోసానికి శంకుస్థాపన: కొండా సురేఖ

నయవంచన పునర్ స్థాపన! మోసానికి శంకుస్థాపన: కొండా సురేఖ

వరంగల్ ప్రజలార జాగ్రత్త! ఇంటి బయట మీ సామాన్లు ఏమన్న ఉంటే లోపలకు తీసుకపోండి, లేకుంటే అవి కూడ తాకట్టు పెట్టి అప్పు చేసేలా ఉన్నాడు కేసీఆర్ & కుటుంబం అంటూ కొండా సురేఖ పేర్కొన్నారు. అంతేకాదు దానికి కూడా కమీషన్లు తీసుకుంటారు ఈ కొడుకులు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.శంకుస్థపన లేదు మన్ను లేదు. అవి నయవంచన పునర్ స్థాపన! మోసానికిశంకుస్థాపన ఈ కొండా సురేఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలను దుమ్మెత్తిపోశారు.

సిగ్గులేనితనానికి నిలువెత్తు రూపం కేసీఆర్ దోపిడీ కుటుంబం

సిగ్గులేనితనానికి నిలువెత్తు రూపం కేసీఆర్ దోపిడీ కుటుంబం

ఇక ఇదే సమయంలో వరంగల్లో టెక్స్ టైల్స్ పార్కుకు గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేశాడని గుర్తు చేసిన కొండా సురేఖ అప్పుడు వాళ్ళ నాయన శంకుస్థాపన చేసిన టెక్సటైల్ పార్కు ఇదే! వరంగల్లో రాహుల్ గాంధీ సభ ఉంది కదా, దానికి భయపడి ప్రజల దృష్టి మరల్చడానికి చేసిన శంకుస్థాపన మళ్ళీ చేస్తున్న కేటీఆర్ అంటూ మండిపడ్డారు. సిగ్గులేనితనానికి నిలువెత్తు రూపం కేసీఆర్ మరియు అతని దోపిడీ కుటుంబం అంటూ కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన శంకుస్థాపన మళ్ళీ చేస్తారా? మొఖానికి సిగ్గుండాలి కేటీఆర్! అంటూ తిట్టిపోశారు.

పట్ట పగలు నిసిగ్గు నాటకాలు: కొండా సురేఖ మండిపాటు

పట్ట పగలు నిసిగ్గు నాటకాలు: కొండా సురేఖ మండిపాటు

మీ కుటుంబం డీఎన్ఎలోనే నయవంచన, మోసం ఉంది అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయన ఇది వరకు ఇదే టెక్సటైల్ పార్కుకు శంకుస్థాపన చేసింది మరిచిపోయావా? పట్ట పగలు నిసిగ్గు నాటకాలు అని కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఎనిమిదేండ్లు అభివృద్ధి పనులకు టైమ్ దొరలేదా కేటీఆర్? ఇప్పుడు, మచ్చలేని మనిషి, ప్రజల మనిషి, మా రాహుల్ గాంధి మీ దుమ్ము దులుపుతాడని, భయపడి, శంకుస్థాపనలు చేసి మళ్లీ ప్రజలను మభ్యపెట్టడానికా? మీ పర్యటనలు అంటూ ప్రశ్నించారు.

హైదరాబాద్ ను డల్లాస్ చేసే శంకుస్థాపన ఎప్పుడో చెప్పండి?

హైదరాబాద్ ను డల్లాస్ చేసే శంకుస్థాపన ఎప్పుడో చెప్పండి?

మీరు ఏమి చేసినా మీ అధికారం పోవటం మాత్రం ఖాయం అంటూ కొండా సురేఖ తేల్చి చెప్పారు. కేటీఆర్ శంకుస్తాపనలు చేస్తే ప్రజలు నిన్ను నీ అయ్యని నమ్ముతారా? చెప్పాలంటూ కొండాసురేఖ ప్రశ్నించారు. నీ అయ్య తెలంగాణను నట్టేట ముంచి అప్పులపాలు చేశాడని మండిపడ్డారు. నాలుగు లక్షల కోట్లు అప్పు జనాలమీద వేసాడని నిప్పులు చెరిగారు. తన కుటుంబం మాఫీయా అంత కలిపి 20-30 లక్షల కోట్లు తినేశారని కొండా సురేఖ ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ ను డల్లాస్ చేసే శంకుస్థాపన ఎప్పుడో చెప్పండి కేటీఆర్ అంటూ ప్రశ్నించారు.

ఏ కల్లు బొట్టు తాగి ఏడ పడుకున్నాడు కేసీఆర్?

ఏ కల్లు బొట్టు తాగి ఏడ పడుకున్నాడు కేసీఆర్?

వరంగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా... ఓపెనింగ్‌కు వస్తా.. కల్లు బొట్టుతోని దావత్ ఇయ్యాలే అని బడాయి మాటలు మాట్లాడిన పెద్ద మనిషి... ఏ కల్లు బొట్టు తాగి ఏడ పడుకున్నాడు అంటూ ప్రశ్నించారు. ఈ ఇండ్లు చూడండి సారూ... ఏ తీరుగ కట్టారో...! ఇదేనా పేదోడు ఆత్మగౌరవంతో బతికే తరీఖా? అంటూ కేటీఆర్ ను నిలదీశారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైలు కూల్చి అదే ప్రాంగణంలో నిర్మించే కార్పోరేట్ హాస్పిటల్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో చూశారా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు కొండా సురేఖ.

వరంగల్ ను వాటికన్ సిటీ గా ఎప్పుడు చేస్తారు?

వరంగల్ ను వాటికన్ సిటీ గా ఎప్పుడు చేస్తారు?

వరంగల్ జిల్లాలోని ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి స్మారక భవనం ఓపెనింగ్ ఎప్పుడు కేటీఆర్ .. ఆ పనులు కూడా కాస్త చూడండి కేటీఆర్.. కేవలం కమీషన్లు వచ్చే పనులకు మాత్రమే మీరు శంకుస్థాపనలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. వరంగల్ బస్టాండ్ ఆధునీకరణ పనులు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన కొండా సురేఖ ఇంకెన్నడు చేస్తారు వరంగల్ ను వాటికన్ సిటీ గా అంటూ నిలదీశారు.

కేటీఆర్.. వరంగల్! ఇది చైతన్యానికి, ఆత్మాభిమానానికి పుట్టినిల్లు. ఇన్ని రోజులు మోసం చేసి ఇప్పుడు వచ్చి శంకుస్థాపనలంటే నిన్ను నీ అయ్యను నమ్మటానికి జనాలు హౌలాగాళ్ళేమీ కాదు. మీ నయవంచన గ్యాంగును గద్దె దించడమే లక్షంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కొండా సురేఖ నిప్పులు చెరిగారు.

కేటీఆర్ నిర్వహించాల్సిన సభ టెంట్ కూలిపోవడంపై కొండా సురేఖ సెటైర్లు

కేటీఆర్ నిర్వహించాల్సిన సభ టెంట్ కూలిపోవడంపై కొండా సురేఖ సెటైర్లు

ముందస్తు పర్యటన ఎందుకు ?కేటీఆర్ అని ప్రశ్నించిన కొండా సురేఖ పదే పదే పాటవోలే ఎన్నికలేమైనా ఇప్పుడున్నాయా అంటూ చెప్పడం దేనికి అని ప్రశ్నించారు. అయ్య ఇచ్చిన హామీలు అవిరి అయినా గానీ,కొడుకు కొలువు కోసం కొట్లాట చేసినట్లు వుంది కథ ! అంటూ కొండా సురేఖ మండిపడ్డారు. ఇక వరంగల్ లో కేటీఆర్ నిర్వహించాల్సిన సభ టెంట్ కూలిపోవడంతో దీనిపైన కూడా సెటైర్లు వేశారు కొండా సురేఖ.

తెలంగాణ సామెత... ఒక పనిమంతుడు పండుగ ఉందని పందిరి వేస్తే...కుక్క తోక తాకితే కూలిపోయింది అంటా పందిరి.. వరంగల్ లో కేటీఆర్ గారి పనితనం గురించి చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయని ముందుగానే కూలిన టెంట్ అంటూ కొండా సురేఖ ఎద్దేవా చేశారు.

English summary
KTR .. Do people believe you and your father CM KCR with the foundation stones in warangal? Konda Surekha was outraged at Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X