వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ తూర్పులో కొండా సురేఖ సమక్షంలో చేరికలు ...గులాబీ నేతలకు టెన్షన్ .. ఆ ఎన్నికలే లక్ష్యం !!

|
Google Oneindia TeluguNews

నిన్నటి వరకు సైలెంటుగా ఉన్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ మళ్లీ పావులు కదుపుతున్నారా ? వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన సురేఖ, వరంగల్ తూర్పు నియోజకవర్గం పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సురేఖ వరంగల్ అర్బన్ లో టిఆర్ఎస్ పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్

 గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించిన సురేఖ

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించిన సురేఖ

గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, అలాగే కేటీఆర్ పై ధిక్కార స్వరాన్ని వినిపించి టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా సురేఖ దంపతులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజక వర్గం నుండి పోటీ చేసి, చల్లా ధర్మారెడ్డి కి గట్టి పోటీ ఇచ్చి పరాజయం పాలయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సురేఖ, ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం పై దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బసవరాజు సారయ్య మీద విజయం సాధించారు సురేఖ. నాడు సురేఖపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం జరిగినప్పటికీ ఆమె వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించారు.

 వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ నేతలకు కంటిలో నలుసులా మారిన సురేఖ

వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ నేతలకు కంటిలో నలుసులా మారిన సురేఖ

వరంగల్ అర్బన్ రాజకీయాలలో సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు, అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అప్పట్లో మేయర్ గా పనిచేసిన నన్నపనేని నరేందర్ కు కంట్లో నలుసుగా మారారు. వీరి మధ్య నెలకొన్న అంతర్గత వివాదం చిలికి చిలికి గాలివాన కాగా చివరకు సురేఖ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సురేఖ, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు వరంగల్ తూర్పు నియోజకవర్గం పై దృష్టిసారించారు. గ్రేటర్ వరంగల్ లో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సురేఖ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు వలసలు

టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు వలసలు

తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సురేఖ సమక్షంలో పెద్దఎత్తున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండా సురేఖ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ యాకూబ్ పాషా 200 మంది కార్యకర్తలతో కలసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటి నుండే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని కొండా సురేఖ భావిస్తున్నారు. గతంలో తూర్పు నియోజక వర్గంలో పర్యటించిన మురళి తమ అభిమానులు తూర్పు నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం తూర్పు నియోజకవర్గంలో రంగంలోకి దిగుతామని ప్రకటించారు. తూర్పులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి డివిజన్లో వారికే కమిటీలు వేస్తామని కచ్చితంగా టీఆర్ ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి తీరతామని కొండా మురళి పేర్కొన్నారు.

వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపించే పనిలో కొండా దంపతులు

వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపించే పనిలో కొండా దంపతులు

గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన వరంగల్ తూర్పు నియోజకవర్గం పై కొండా సురేఖ దృష్టి సారించారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నన్నపనేని నరేందర్ పనితీరుపై ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో కొంతమేర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తున్న సమయంలో ఇదే అదునుగా భావిస్తున్న కొండా సురేఖ తూర్పు నియోజక వర్గంలో పావులు కదుపుతున్నారు . తూర్పు నియోజకవర్గంలో ఉన్న మైనారిటీల ఓటు బ్యాంకు ఆమెకు ప్లస్ గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Recommended Video

Watch MLA Seethakka Helping in East Godavari, Suggests Jagan To Help Adivasi Konda Reddis
జీ డబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యంగా సురేఖ వ్యూహం

జీ డబ్ల్యూఎంసీ ఎన్నికలే లక్ష్యంగా సురేఖ వ్యూహం

ఏదేమైనప్పటికీ తూర్పు నియోజకవర్గంలో చక్రం తిప్ప బోతున్న కొండా సురేఖ వరంగల్ అర్బన్ జిల్లా లోని టీఆర్ఎస్ నాయకులకు టెన్షన్ పుట్టిస్తున్నారు . రానున్న మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆమె టార్గెట్ అన్నట్టుగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తన అనుయాయులను, కార్యకర్తలను కలుస్తున్న సురేఖ తీరుతో టిఆర్ఎస్ పార్టీలో చర్చ మొదలైంది.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే , మాజీ మేయర్ నరేందర్ పై గతంలో టీఆర్ ఎస్ లో ఉన్న సమయంలోనే నిప్పులు చెరిగిన కొండా దంపతులు ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో నరేందర్ కు షాక్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు.

English summary
Konda Surekha trying to check the TRS party in the upcoming Municipal Corporation elections. Recently, a large number of TRS activists joined the Congress party in the presence of Konda Surekha. In the presence of Konda Surekha, former TRS party corporator Yakub Pasha joined the Congress along with 200 activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X