హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వందేళ్ల క్రితమే స్మార్ట్ సిటీ: కొండా, 2017నాటికి మెట్రో పూర్తి: ఎన్వీఎస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరం ఎప్పటి నుంచో స్మార్ట్‌సిటీగా వర్ధిల్లుతోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వందేళ్ల క్రితమే స్మార్ట్‌సిటీ ఛాయలతో నగరం రూపుదిద్దుకుందని.. మళ్లీ స్మార్ట్‌సిటీగా మార్చుకునేందుకు నగరవాసులు ముందుకు రావాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఫిక్కీ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ‘స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ సొసైటీస్' అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనుకూలంగా.. వాణిజ్యం, వ్యాపారాలను అనువైన ప్రాంతంగా విరాజిల్లుతోందని అన్నారు. ఇక్కడి మానవ వనరుల లభ్యత.. ఇక్కడి నాణ్యమైన జీవనం స్మార్ట్‌సిటీగా అవతరించడానికి తోడ్పాటునందిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

స్మార్ట్‌గా సిటీగా అభివృద్ధి చెందడానికి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలన్నారు. నగరం విస్తరించినా.. జనాభా పెరిగినా.. కృష్ణా మూడోదశ, గోదావరి జలాలతో నగరవాసులకు నీళ్లందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో నగరాల అభివృద్ధిపై దృష్టి సారించిందని వివరించారు.

2017 మెట్రో పనులు పూర్తి: ఎన్వీఎస్

పట్టణాల్లో నివసించే పేదలకు సైతం మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నదే స్మార్ట్‌సిటీ ప్రతిపాదన సంకల్పమని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అరుదైన ఇంజనీరింగ్ నైపుణ్యత, అంతర్జాతీయ అత్యాధునిక ప్రమాణాలతో మెట్రోరైలు రూపొందుతుందని వివరించారు.

ఆధునిక హంగులతో రూపొందుతున్న మెట్రోరైలు తొలి దశ మూడు కారిడార్లను ప్రాజెక్టును వచ్చే 2017 సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని వివరించారు. ప్రస్తుతం నాగోలు-మెట్టుగూడ వరకు పరుగులు తీసేందుకు సర్వం సిద్ధంగా ఉన్నా.. మరికొంత దూరం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే సంవత్సరం మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.

కొండా విశ్వేశ్వర రెడ్డి

కొండా విశ్వేశ్వర రెడ్డి

భాగ్యనగరం ఎప్పటి నుంచో స్మార్ట్‌సిటీగా వర్ధిల్లుతోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. వందేళ్ల క్రితమే స్మార్ట్‌సిటీ ఛాయలతో నగరం రూపుదిద్దుకుందని.. మళ్లీ స్మార్ట్‌సిటీగా మార్చుకునేందుకు నగరవాసులు ముందుకు రావాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

ఆధునిక హంగులతో రూపొందుతున్న మెట్రోరైలు తొలి దశ మూడు కారిడార్లను ప్రాజెక్టును వచ్చే 2017 సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని వివరించారు.

ఎన్వీఎస్ రెడ్డి

ఎన్వీఎస్ రెడ్డి

ప్రస్తుతం నాగోలు-మెట్టుగూడ వరకు పరుగులు తీసేందుకు సర్వం సిద్ధంగా ఉన్నా.. మరికొంత దూరం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే సంవత్సరం మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

ఆధునిక హంగులతో రూపొందుతున్న మెట్రోరైలు తొలి దశ మూడు కారిడార్లను ప్రాజెక్టును వచ్చే 2017 సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని వివరించారు.

English summary
MP Konda Vishweshwar reddy on Tuesday said that Hyderabad is a smarty city since 100 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X