• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈటల రాజేందర్ కొత్త పార్టీ! -జగన్‌తో వైఎస్ షర్మిల ఒప్పందం -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలనం

|

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దీటుగా కొత్త ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని చేవెళ్ల మాజీ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో గులాబీ అధినాయకత్వంపై అనూహ్య వ్యాఖ్యలు చేస్తోన్న మంత్రి ఈటల రాజేందర్ సారధ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావొచ్చని కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ దుస్థితి, వైఎస్ షర్మిల కొత్త పార్టీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో షర్మిల ఒప్పందాలు తదితర అంశాలపైనా అనూహ్య కామెంట్లు చేశారు. కొండా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

జగన్‌పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారంజగన్‌పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం

జోష్ వచ్చినా లాభం లేదు..

జోష్ వచ్చినా లాభం లేదు..


‘‘కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయనే పార్టీ మారాను. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారు. దేశం మొత్తం కాంగ్రెస్ పరిస్థితి బాలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళన ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వచ్చింది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ను వీడిన తర్వాత కొత్త పార్టీ పెట్టాలా? వేరే పార్టీలో చేరాలా లేక ఇండిపెండెంట్ గా ఉండాలా అనేదానిపై పలువురిని కలుస్తున్నాను. ఈ మధ్యే..

viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలుviral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు

ఈటల రాజేందర్ కొత్త పార్టీ..

ఈటల రాజేందర్ కొత్త పార్టీ..

నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రొఫసర్ కొదండరాం, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ లాంటి నేతలను, ఇంకొందరు కులసంఘాల నాయకులను కలిశాను. అదే సమయంలో టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్‌మెంట్ కూడా అడిగాను. ఆయనింకా స్పందించలేదు. తప్పకుండా కలిసి మాట్లాడుతాను. ఫ్లోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్లు నాతో మాట్లాడటం లేదు. రాజేందర్ ఓక్కోసారి సీఎం కేసీఆర్‌పై అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తుంటారు. బీసీ, ముదిరాజ్‌లతో ఈటల రాజేందర్‌తో కొత్త పార్టీ పెట్టించేలా కేసీఆర్ ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈటల రాజేందర్ గొప్ప వామపక్షవాది. నిజంగా ఆయనకు కేసీఆర్ తో సమస్యలుంటే, బయటకు వచ్చేయాలనుకంటే ఆపనిని వెంటనే చేయాలని నేను చెబుతున్నాను. కానీ

టీఆర్ఎస్ నాయకత్వం మారితే..

టీఆర్ఎస్ నాయకత్వం మారితే..

కేసీఆర్ డైరెక్షన్ లో కాకుండా ఈటల రాజేందర్ సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతారు. ఇవేవీ చేయకుండా ఆలస్యం చేస్తే గనుక సీఎం కేసీఆర్‌తో కలసి ఈటల కూడా డ్రామాలు ఆడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో నాకు బాగా ఇష్టమైన నేతలు ఇద్దరున్నారు. తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం వారి లక్షణం. ఆ ఇద్దరే మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పక్కకు తప్పుకుని.. టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీశ్ లేదా ఈటలకు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ప్రాంతీయ పార్టీ చాలా అవసరం..

ప్రాంతీయ పార్టీ చాలా అవసరం..


అధికార టీఆర్ఎస్ పై పోరాటంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దీటుగా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం చాలా ఉంది. అందుకే టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో నన్ను బీజేపీలో చేరమని ముస్లిం స్నేహితులు సలహా ఇచ్చారు. కానీ వాళ్లే ఇప్పుడు వద్దంటున్నారు. నేను కొత్త పార్టీ పెట్టాలని అనుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువైతే మళ్లీ అంతిమంగా టీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుంది. నేను ఏం చేయాలన్నదానిపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి వస్తా. ఈలోపు వైఎస్ షర్మిల పార్టీలో చేరతానీ నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు. పచ్చి సమైక్యవాది. షర్మిల కూడా తెలంగాణ వ్యతిరేకి అనే అభిప్రాయముంది. తెలంగాణవాదినైన నేను షర్మిల పార్టీలో చేరబోను. వైసీపీలో మా బంధువులున్నారు. షర్మిల పార్టీలో చేరాలని నన్ను అడిడితే కుదరదని చెప్పాను. షర్మిలకు పార్టీ పెట్టుకునే హక్కుంది. తెలంగాణలో రెడ్డి, క్రిస్టియన్ ఓట్లు ఆమెకు పడే అవకాశముంది. వైసీపీతోగానీ, సోదరుడు జగన్ తోగానీ షర్మిలకు విభేదాలు ఉన్నాయన్న మాట అవాస్తవం. ఇరువురికీ పరస్పర అవగాహన ఉంది. అందుకే వైసీపీ వాళ్లంతా షర్మిల కొత్త పార్టీలో చేరుతున్నారు. ఒప్పందంతోనే షర్మిల పార్టీ పెట్టి ఉండొచ్చ'' అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

English summary
chevella former mp konda vishweshwar reddy made sensational comments on trs minister etela rajender, cm kcr and ys sharmila. speaking to media on sunday, konda said, cm kcr would make etela rajender to form a new political party in telangana. former mp also said ts sharmila has an understanding with brother ys jagan. konda stressed for an another regional party in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X