• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

White Challenge: బండి సంజయ్,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి...

|

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన వైట్ ఛాలెంజ్‌ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సవాల్ మేరకు వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి... మరో ఇద్దరికి ఆ ఛాలెంజ్‌ను విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి మరో ఇద్దరికి ఛాలెంజ్ ఇవ్వమని చెప్పారని... 10 మందికి ఇచ్చే అవకాశం ఉంటే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం,జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న మరికొంతమందికి ఈ సవాల్ విసిరేవాడినని చెప్పారు.

'అలా మాట్లాడుతున్నాడంటే... రాజకీయ జీవితం ఫుల్ స్టాప్'

'అలా మాట్లాడుతున్నాడంటే... రాజకీయ జీవితం ఫుల్ స్టాప్'

'రేవంత్ రెడ్డి నాకు,కేటీఆర్‌కు ఛాలెంజ్ విసిరారని కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలని గన్‌పార్క్ వద్దకు వచ్చాను.వైట్ ఛాలెంజ్ సమాజానికి మంచిది.నాయకులు,సెలబ్రిటీలు అందరూ ముందుకొస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుంది.కానీ రామారావు ఈ ఛాలెంజ్ స్వీకరించేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. పైగా ఆయన చెబుతున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయి.నాది రాహుల్ గాంధీ స్థాయి అని మాట్లాడుతున్నాడు.కేటీఆర్ ఇక్కడికి వస్తే.. ఆయన స్థాయి పెరిగేది.. గౌరవప్రదంగా ఉండేది.ఎవరైనా రాజకీయ నాయకుడు తన స్థాయి వేరే అని మాట్లాడుతున్నాడంటే... అదే రోజు అతని రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ అయినట్లు.ఎంత గొప్ప నాయకుడైనా కింద స్థాయి వాళ్ల వద్దకు వెళ్తేనే గౌరవం పెరుగుతుంది.' అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల అఫిడవిట్‌లో చేర్చాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఎన్నికల అఫిడవిట్‌లో చేర్చాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వైట్ ఛాలెంజ్ ఎవరు విసిరినా స్వీకరించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒక చిన్న పాప ఇచ్చినా... మొన్న హత్యాచారానికి గురైన చిన్నారి తల్లి ఇచ్చినా స్వీకరించాలన్నారు.ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు ఛాలెంజ్ విసిరితే... తన స్థాయి వేరే అని మాట్లాడటం అహంకారమా,అపరిపక్వతనా అని ప్రశ్నించారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే ఖతమ్ చేసుకుంటున్నాడని విమర్శించారు. ప్రభుత్వం కూడా ఇలాగే ఉందని... డ్రగ్స్ వ్యవహారంలో విచారణ నిమిత్తం తమకు సహకరించాలని ఈడీ కోరితే అందుకు నిరాకరించిందన్నారు. అమెరికా లాంటి దేశాల్లో డ్రగ్ టెస్ట్ పాసైతేనే ఉద్యోగాలిస్తారని... ఇక్కడ ఎన్నికల అఫిడవిట్‌లోనూ డ్రగ్ టెస్ట్ రిజల్ట్స్ సర్టిఫికెట్‌ను చేర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

సంజయ్,ప్రవీణ్‌లకు ఛాలెంజ్...

సంజయ్,ప్రవీణ్‌లకు ఛాలెంజ్...

కేటీఆర్ తొందరపడి మాట్లాడారో... అవగాహన లేకనో తెలియదు గానీ... ఇది తెలంగాణ గడ్డ అని,తెలంగాణలో జరుగుతున్న విషయమని.... ఛాలెంజ్‌కు ముందుకు రావాలని కోరారు. ఇది కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదన్నారు.యువతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలని పేర్కొన్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,యువకులకు ఆదర్శంగా ఉన్న నాయకుడు ప్రవీణ్ కుమార్ గారికి ఈ ఛాలెంజ్ విసురుతున్నానని చెప్పారు.

కేటీఆర్-రేవంత్ ట్విట్టర్ వార్...

కేటీఆర్-రేవంత్ ట్విట్టర్ వార్...


ఇటీవల గజ్వేల్ సభలో డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌తో తనకేం సంబంధమని... టెస్టులకు తాను సిద్దమని ప్రకటించారు. తన రక్తం,వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు సిద్దమన్నారు. దీంతో రేవంత్ రెడ్డి కేటీఆర్‌‌కు వైట్ ఛాలెంజ్ విసిరారు. గన్‌పార్క్ వద్దకు వస్తే... అక్కడినుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుని... సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని కోరారు. దానికి కేటీఆర్... తాను ఎలాంటి టెస్టుల‌కైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తాన‌ని ట్వీట్ చేశారు. చ‌ర్లప‌ల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదని పేర్కొన్నారు.

English summary
Former MP Konda Vishweshwar Reddy, who accepted the White Challenge after TPCC chief Revanth reddy challenged him,latestly challenged other two for this.He challenged BJP state president Bandi Sanjay and BSP coordinator RS Praveen Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X