వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు .. ప్రారంభించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరుగులు తీశాయి. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలు కొండపోచమ్మ జలాశయాన్ని చేరుకున్నాయి. త్రిదండి చినజీయర్‌ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభించారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌ నుంచి ఈ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో మరొక అద్భుతఘట్టం ఆవిషృతమైంది.

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం .. అత్యంత ఎత్తుకు చేరిన గోదావరి జలాలు

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం .. అత్యంత ఎత్తుకు చేరిన గోదావరి జలాలు

దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. అంతేకాకుండా భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి కొండపోచమ్మ సాగర్‌కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.

గంగమ్మకు కేసీఆర్ పూజలు .. గోదావరికి హారతి

గంగమ్మకు కేసీఆర్ పూజలు .. గోదావరికి హారతి

సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి కలిసి గంగమ్మకు పూజలు నిర్వహించారు . గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ దంపతులు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కలిపారు. కొండపోచమ్మ సాగర్‌లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది దశగా చెప్పుకునే 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.

ఇక కొండపోచమ్మ సాగర్ కు వీటిని విడుదల చేస్తూ ఈరోజు సీఎం కేసీఆర్ దంపతులు ప్రారంభోత్సవం చేయడంతో దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు.

Recommended Video

Kondapochamma Reservoir Inauguration, CM KCR Performed Chandi Yagam
సంతోషంలో ట్వీట్ చేసిన కేటీఆర్ .. ఏమన్నారంటే

సంతోషంలో ట్వీట్ చేసిన కేటీఆర్ .. ఏమన్నారంటే

కెసిఆర్ అంటే కె అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని పేరు సార్థకం కాగా మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపిణీ చేసి భారతదేశంలోనే యంగెస్ట్ సిటీ అయిన తెలంగాణ తన సత్తా చాటుకుంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మొత్తానికి 5 జిల్లాల వరప్రదాయినిగా నిర్మాణమైన కొండపోచమ్మ రిజర్వాయర్ నేటి నుండి జల సిరులతో కళకళలాడనుంది.

English summary
Godavari waters run into Kondapochamma reservoir. The Godavari waters have reached the Kondapochamma reservoir from the highly ambitious Kaleshwaram Lifting Scheme, which was organized by the Telangana government. CM KCR couple together with Trindandi China jeeyar Swamiji inaugurated the Kondapochamma reservoir today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X