వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం..చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలోనూ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇక నేడు తెలంగాణలో మరో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఈరోజు కొండపోచమ్మ జలాశయంలోకి చేరుతున్న సందర్భంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా విచ్చేసారు.

Recommended Video

Kondapochamma Reservoir Inauguration, CM KCR Performed Chandi Yagam

Nizamabad MLC election : కేసీఆర్ తనయకు ఎన్ని కష్టాలు.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులుNizamabad MLC election : కేసీఆర్ తనయకు ఎన్ని కష్టాలు.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులు

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం వేళ యాగాలలో పాల్గొంటున్న కేసీఆర్ దంపతులు

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం వేళ యాగాలలో పాల్గొంటున్న కేసీఆర్ దంపతులు

ఇక ఈ సందర్భంగా జరుగుతున్న యాగాలలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటున్నారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అవుతున్నవేళ ఈరోజు తెల్లవారుజాము నుండే కొండ పోచమ్మ దేవాలయంలో యాగాలు మొదలయ్యాయి. కొండ పోచమ్మ దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి నవ చండీ యాగం ప్రారంభం కాగా కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ వద్ద సుదర్శన యాగం జరగనుంది.

 సతీసమేతంగా చండీయాగంలో పాల్గొన్న కేసీఆర్

సతీసమేతంగా చండీయాగంలో పాల్గొన్న కేసీఆర్

సీఎం కేసీఆర్సతీసమేతంగా కొండపోచమ్మ దేవాలయం వద్దకు చేరుకొని చండీయాగంలో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. దేవాలయంలో చండీయాగం అనంతరం కేసీఆర్అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

పంప్ హౌజ్ వద్ద సుదర్శనయాగం .. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం

పంప్ హౌజ్ వద్ద సుదర్శనయాగం .. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం

ఆ తరువాతమర్కూక్ వద్ద గలకొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకునే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలికి అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు సీఎం దంపతులు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు.

ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా కొండ పోచమ్మ రిజర్వాయర్

ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా కొండ పోచమ్మ రిజర్వాయర్

మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించి వారితో మాట్లాడతారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఐదు జిల్లాల ప్రజల తాగునీటి సాగునీటి అవసరాలను తీర్చింది. ఇక ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు.

English summary
Kondapochamma Reservoir, which was built as part of the Kaleshwaram Lifting Scheme, is expected to become a irrigation, and driniking needs for the five districts of the state. The Kondapochamma reservoir will be inaugurated by CM KCR today. Chandi Yagam and Sudarsana Yagam are conducting before the inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X