మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలు

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. వేసవికాలంలో నీటి ఎద్దటి దృష్ట్యా రెండున్నర టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు కర్ఱాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అంగీకారం తెలిపారు. ఆ మేరకు మూడు రోజుల కిందట నీటిని విడుదల చేశారు అక్కడి అధికారులు. సోమవారం నాడు కృష్ణా జలాలు నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించాయి.

పాలమూరు నీటి కష్టాలు.. కేసీఆర్ చొరవ

పాలమూరు నీటి కష్టాలు.. కేసీఆర్ చొరవ

పాలమూరు జిల్లా ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీరు తెచ్చుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం లేదని ఆలోచించారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు స్వయంగా అక్కడి సీఎం కుమారస్వామికి ఫోన్ చేశారు. మే 3వ తేదీన ఆయనకు కేసీఆర్ ఫోన్ చేసిన నేపథ్యంలో నీళ్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావడం.. దానికి తోడు ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి.
జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో జిల్లావాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ వినతి మేరకు కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీటి విడుదలకు కుమార స్వామి ఓకే చెప్పారు.

టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?

జూరాలకు కృష్ణా జలాలు

జూరాలకు కృష్ణా జలాలు

నీటి విడుదల కోసం కేసీఆర్ లేఖ రాసిన నేపథ్యంలో.. కర్ణాటక అధికారులతో కుమారస్వామి చర్చించారు. నారాయణపూర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత ఉన్న కారణంగా.. పాలమూరుకు నీళ్లు ఇచ్చేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేస్తామని స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పడం విశేషం.

కుమారస్వామి ఆదేశాలతో కర్ణాటక అధికారులు మూడు రోజుల కిందట పాలమూరుకు నీటిని విడుదల చేశారు. దాంతో సోమవారం (13.05.2019) నాడు కృష్ణా జలాలు నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించాయి. మొదటిరోజు 2 వేల 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, మర్నాడు 8 వేల క్యూసెక్కులు రిలీజ్ చేశారు. అలా రెండున్నర టీఎంసీల నీరును ఇప్పటికే అక్కడి అధికారులు రిలీజ్ చేశారు. మంగళవారం (14.05.2019) నాటికి జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలు చేరుకోనున్నాయి.

ఒకరికొకరు..!

ఒకరికొకరు..!

పోయినేడాది తుంగభద్ర జలాల్లో ఆర్డీఎస్ వాటా నుంచి.. ఒక టీఎంసీ నీటిని వాడుకుంటామన్న కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. ఆ క్రమంలోనే జూరాలకు నీటి విడుదలపై కేసీఆర్ లేఖ రాయగానే కుమారస్వామి వెంటనే స్పందించారనే టాక్ నడుస్తోంది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 18.06 (50శాతం) టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి రెండున్నర టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. మొత్తానికి ఈ నీటితోనైనా జిల్లావాసుల తాగునీటి కష్టాలు తీరుతాయామో చూడాలి.

English summary
The water released from Karnataka Narayanpur reservoir to Jurala project to cater to the drinking water needs. In view of the water levels steeply coming down in the reservoirs of Mahabubnagar district, Chief Minister K. Chandrashekhar Rao had requested Karnataka CM H.D. Kumaraswamy for release of water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X