వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తిని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు సోమవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వెంట నాస్కామ్ చైర్మన్, తెలంగాణ హబ్ డైరెక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు.

ముంబైకి బయల్దేరిన కెటిఆర్

పారిశ్రామిక రంగంలో వివిధ కార్పొరేట్ సంస్థలను ప్రత్యేకించి టాటా గ్రూప్ సంస్థలను భాగస్వాములను చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఒకరోజు పర్యటన నిమిత్తం మంగళవారం ముంబై వెళ్లారు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ సహా ఎనిమిది గ్రూప్ అనుబంధ సంస్థల సీఈవోలతో సమావేశం కానున్నారు.

నారాయణమూర్తితో కెటిఆర్

నారాయణమూర్తితో కెటిఆర్

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తిని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు సోమవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

నారాయణమూర్తితో కెటిఆర్

నారాయణమూర్తితో కెటిఆర్

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వెంట నాస్కామ్ చైర్మన్, తెలంగాణ హబ్ డైరెక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు.

నారాయణమూర్తితో కెటిఆర్

నారాయణమూర్తితో కెటిఆర్

పారిశ్రామిక రంగంలో వివిధ కార్పొరేట్ సంస్థలను ప్రత్యేకించి టాటా గ్రూప్ సంస్థలను భాగస్వాములను చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.

నారాయణమూర్తితో కెటిఆర్

నారాయణమూర్తితో కెటిఆర్

అందులో భాగంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఒకరోజు పర్యటన నిమిత్తం మంగళవారం ముంబై వెళ్లారు.

నారాయణమూర్తితో కెటిఆర్

నారాయణమూర్తితో కెటిఆర్

టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీ సహా ఎనిమిది గ్రూప్ అనుబంధ సంస్థల సీఈవోలతో సమావేశం కానున్నారు.

ఈ సమావేశం గతంలో ఒకటి రెండుసార్లు ఖరారైనా వివిధ కారణాలతో వాయిదాపడింది. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ముంబై వెళ్లిన మంత్రి కేటీఆర్.. పరిశోధనల కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న టీ హబ్‌లో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ సంస్థలను కోరనున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్) వంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవాలని ఆయన కోరే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని మంత్రి కేటీఆర్ కోరనున్నారు. మిస్త్రీతోపాటు ఇతర టాటా సంస్థల సీఈఓలతో సమావేశమై వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, రంగాల వారీగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను ఆయన వివరిస్తారు.

English summary
K.T.Rama Rao, Minister for Panchayat Raj and IT, Govt. of Telangana on Monday met Infosys Narayanamurthy at Novotel ,Shamshabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X