వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

haircut:భార్య హెయిర్ కత్తిరిస్తోందట, సెలూన్ షాపు ఓపెన్ చేయండి, కేటీఆర్‌కు ట్వీట్, కోహ్లి లాగా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు బంద్.. ఇందుకు హెయిర్ కట్ సెలూన్లకు మినహాయింపేమీ లేదు. అయితే నెలరోజులకు పైగా సెలూన్లు మూసివేసి ఉండటంతో కటింగ్, గడ్డం పెరుగుతోంది. ఈ సమస్యను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కూడా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.

యాక్టివ్..

మంత్రి కేటీఆర్.. అనునిత్యం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అడిగే సందేహాలకు సమాధానం ఇస్తుంటారు. సమస్యకు పరిష్కారం కూడా చూపుతుంటారు. అయితే ఇటీవల ఆయనకు విచిత్రమైన సమస్యను ప్రస్తావించాడు ఓ నెటిజన్. రెండో విడత లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు ఉన్నా.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఉన్నాయి. ఇందులో సెలూన్లను కూడా చేర్చాలని ఔత్సాహికులు కోరుతున్నారు.

ఓపెన్ చేయండి.

ఓపెన్ చేయండి.

ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులను తెరవాలని కోరారు. లేదంటే తన భార్య వెంట్రుకలు కట్ చేయిస్తానని చెబుతోంది. ఒకవేళ మీరు సెలూన్ షాపులను తెరవకుంటే తన వెంట్రుకలను తన భార్య కత్తిరించడం ఖాయం అని పేర్కొన్నాడు. ఒకవేళ అదే జరిగితే.. తాను లాక్ డౌన్ ఎత్తివేసిన బయటకు రాలేని పరిస్థితి అని వివరించారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా అదేస్థాయిలో సమాధానం ఇచ్చారు.

కోహ్లి లాగా..?

కోహ్లి లాగా..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ.. అతని హెయిర్ ట్రీమ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. క్రికెట్ ఆరాధించే మీరు.. కోహ్లిని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు అని కేటీఆర్ అడిగారు. మంత్రి సమాధానంతో నెటిజన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తర్వాత కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు.

Recommended Video

RBI Governor Press Meet Highlights, RBI Cuts Reverse Repo Rate By 25 Bps to 3.75%
వదినకు ఛాన్స్ ఇస్తున్నారా..?

వదినకు ఛాన్స్ ఇస్తున్నారా..?

అన్నయ్య మీరు కూడా వదినకు ఛాన్స్ ఇస్తున్నారా అని కవిత ట్వీట్ చేశారు. మీ హెయిర్ స్టైల్ కూడా వదిన సెట్ చేస్తున్నారా అని అడిగారు. అన్నయ్యతో తనకున్న చనువుతో కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ రిప్లై.. అందుకు కవిత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ రిప్లైను నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

English summary
Hyderabadi requested the Telangana government to open barber shops after April 20 before his wife gives him a haircut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X