వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!

ఈటల రాజేందర్ పై ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిని మంత్రి కేటీఆర్ ప్రకటించేశారు. తనకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్న గెల్లు శ్రీనివాస్ కు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో నిన్న పర్యటించి తనదైన శైలిలో ఈటలను విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఈటల రాజేందర్ పై ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిని కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించేశారు.

హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన మంత్రి కేటీఆర్

హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించిన మంత్రి కేటీఆర్

హుజురాబాద్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఈటల రాజేందర్ ను ఓడించడం టార్గెట్ గా పెట్టుకొని రంగంలోకి దిగారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రకటించేశారు. వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు.

ఈటలను ఓడించటమే లక్ష్యంగా రంగంలోకి మంత్రి కేటీఆర్

ఈటలను ఓడించటమే లక్ష్యంగా రంగంలోకి మంత్రి కేటీఆర్


దీంతో వచ్చే ఎన్నికలలో ఈటల రాజేందర్ ను కౌశిక్ రెడ్డి ఢీకొట్టబోతున్నట్టుగా అటు పార్టీ వర్గాలలోను, స్థానికులలోను చర్చ జరుగుతుంది. గత ఉప ఎన్నికలలో టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్ ముందే మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవడం ఆయనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇక దీంతో సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేసే సవాల్ చేస్తున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు మంత్రి కేటీఆర్.

గెల్లుకు షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

గెల్లుకు షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్


గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పనిచేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.

హుజురాబాద్ టికెట్ కోసం గెల్లుకు పాడి కౌశిక్ రెడ్డికి మధ్య పోటీ

హుజురాబాద్ టికెట్ కోసం గెల్లుకు పాడి కౌశిక్ రెడ్డికి మధ్య పోటీ

హుజురాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని కార్యక్రమాలను నిర్వహిస్తూ పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ కు, ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డి దూకుడు పెంచడం కాస్త ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో గెల్లు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మరీ తానే ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

 తేల్చేసిన కేటీఆర్.. ఈటలపై అభ్యర్థి ఫిక్స్

తేల్చేసిన కేటీఆర్.. ఈటలపై అభ్యర్థి ఫిక్స్

ఇక ఇప్పుడు మంత్రి కేటీఆర్ గెల్లు శ్రీనివాస్ ను పక్కనపెట్టి పాడి కౌశిక్ రెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పాడి కౌశిక్ రెడ్డి మరింత దూకుడుగా నియోజకవర్గంలో ముందుకు వెళ్లనున్నారు. ఈటల రాజేందర్ తో వచ్చే ఎన్నికలలో తలపడనున్నారు. కానీ ఈటల రాజేందర్ ని ఢీకొట్టడం పాడి కౌశిక్ రెడ్డికి అంత సాధ్యమవుతుందా? ఈటల రాజేందర్ పాడి కౌశిక్ రెడ్డిని ప్రత్యర్థిగా పరిగణిస్తారా? ఆయన నిజంగానే సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తారా? వంటి అనేక అంశాలు ముందు ముందు తేలనున్నాయి.

English summary
The candidate is fixed on Etela. After announcing the name of Padi Kaushik Reddy, KTR suggested that he should be in public for the next eight months. Gellu Srinivas was shocked by KTR's announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X