వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంగార్డులను అభినందించిన కెటిఆర్ (వీడియో)

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

గుండెపోటుకు గురైన వ్యక్తి ని తెలంగాణా పోలీసులు ఎలా కాపాడారో చూడండి !

హైదరాబాద్: గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసలు కురిపించారు.ఈ మేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు.

గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులను ప్రశంసిస్తూ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీట్ చేశారు.బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ విషయం తెలుసుకొన్న కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వారిని అభినందించారు.

సీపీఆర్‌ విధానంపై కానిస్టేబుళ్ళందరూ కూడ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ఈ శిక్షణ ఉపయోగపడుతోందని కెటిఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌, నగర ట్రాఫిక్‌ డీసీపీ రఘనాథ్‌ కూడా వారిపై ప్రశంసరిపించారు.

బుధవారం ఉదయం పురానాపూల్‌ మీదుగా జహనుమా వైపు బైక్‌ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు.

ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్‌(కార్డియోపల్మనరి రెససిటేషన్‌) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్‌ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది.

English summary
Telangana IT minister KTR appreciated Home guards Chandan and Inayatullah khan of Bahadurpura police station.They were saved the life of person on Wednesday at Puranapul in Old city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X