వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ సీఎంగా కేటీఆర్ ..? సీనియర్లతో మంతనాలు చేస్తున్న కేసీఆర్ ..ముహూర్తం ఖరారేనా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరావు డిప్యూటీ సీఎం కానున్నారా ? కేసీఆర్ తరువాత నంబర్ 2గా కొనసాగుతున్న కేటీఆర్... ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారా ? సీఎం కేసీఆర్ సీఎం చేసేకంటే ముందు డిప్యూటీ సీఎం చేసి కుమారుడికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించనున్నారా ? అందుకోసం వ్యూహాత్మకంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారా ?అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

డిప్యూటీ సీఎం గా కేటీఆర్ కు అవకాశం

డిప్యూటీ సీఎం గా కేటీఆర్ కు అవకాశం

తెలంగాణామంతి, టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చ సాగుతుంది . తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ టీఆర్ ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒక ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆయనకు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇవ్వనున్నారు అన్న వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం తరువాత కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగినా అందుకు భిన్నంగా , సీఎం చెయ్యాలనే ఆలోచనకు దగ్గరగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.

సీనియర్ నాయకులతో చర్చిస్తున్న కేసీఆర్

సీనియర్ నాయకులతో చర్చిస్తున్న కేసీఆర్

టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గా ఉన్న కేటీఆర్ ని ఒకేసారి సీఎం గా ప్రజలు, అలాగే పార్టీ నేతలు అంగీకరిస్తారో లేదో తెలీదు కాబట్టి సీఎం కేసీఆర్ నిదానంగా అడుగులు వేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ తర్వాత కీలకంగా పార్టీలో చెప్పుకున్న హరీష్ రావును సైలెంట్ చేసి కుమారుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చి పార్టీ మీద పట్టు సాధించేలా చేశారు. ఇక ఒకేసారి సీఎంగా పాలన సాగించటంలో ఏదైనా ఇబ్బంది వస్తుందని ముందుగా ఉప ముఖ్యమంత్రిగా చేయాలనీ సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది . అందుకోసం పార్టీ సీనియర్ నాయకులతో కూడా చర్చించినట్టు సమాచారం .

త్వరలోనే కీలక ప్రకటన

త్వరలోనే కీలక ప్రకటన

త్వరలోనే ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తన కేబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ను నియమించారు . అయితే కేటీఆర్ కోసమే కేసీఆర్ ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

 జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ .. అందుకే ఈ నిర్ణయం

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ .. అందుకే ఈ నిర్ణయం

కేటీఆర్ కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి పూర్తి బాధ్యతలని ఆయనకి అప్పగించి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న పలువురు మంత్రులు సైతం కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇక సీఎం కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అంటే కేటీఆర్ అన్న భావన వచ్చేలా ఇప్పటికే చాలా వరకు పార్టీ నేతలు ప్రిపేర్ అయ్యారు .

నెలరోజుల్లోనే డిప్యూటీ సీఎంగా కేటీఆర్?

నెలరోజుల్లోనే డిప్యూటీ సీఎంగా కేటీఆర్?

ఇక ఈ క్రమంలోనే కొద్ది రోజుల పాటు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించి ఇలా అంచెలంచెలుగా కేటీఆర్ ముందుకు వెళ్ళేలా చూడాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్ . ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక నెల రోజుల్లోనే కేటీఆర్ ను డిప్యూటీ సీఎం చెయ్యనున్నారని తెలుస్తుంది . వచ్చే ఎన్నికల లోపు పార్టీ పూర్తి బాధ్యతలని సీఎం కేసీఆర్ కేటీఆర్ కు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

English summary
Telangana Rashtra Samithi working president, Minister K Taraka Rama Rao (KTR) is likely to become Deputy Chief Minister. Sources revealed that Telangana chief minister K Chandrashekar Rao (KCR) held discussions with senior leaders in TRS over the issue and likely to allot deputy CM post to KTR. It is learnt that it will take one month to complete the entire process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X