• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నా రక్తం- వెంట్రుకలు ఇస్తా ..దేనికైనా సిద్ధం- రాహుల్ రెడీనా : సీఎంను తాగుబోతు అంటారా : కేటీఆర్ సవాల్..!!

By Chaitanya
|

టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం తెలంగాణలో రాజకీయంగానూ ఆరోపణలకు కారణమవుతోంది. కొద్ది రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా కొన్ని ఆరోపణలు చేసారు. వీటికి మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. నేరుగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అదే సమయంలో అనేక కీలక అంశాలు..హుజూరాబాద్ బై పోల్ గురించి కేటీఆర్ ఆసక్తి కర అంశాలను వెల్లడించారు.
తెలంగాణకు 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని.. సంక్షేమంలో మేము నిమగ్నమయ్యామన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ఒకాయన మార్కెట్ లో నేనున్నాను అని చూపుకుంటున్నారుని విమర్శించారు. హుజురాబాద్ లో టీఆరెస్ కచ్చితంగా గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తని చెబుతూనే.. చిన్న పిలగాడు ఓడించాడని నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాన్ని ప్రస్తావించారు. ప్రజలకు టీఆరెస్ పై నమ్మకం ఉందన్నారు.

హుజురాబాద్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు వస్తాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్తగా కాంగ్రేస్ లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చిందని.. రేపు భవిష్యత్ లో పీసీసీ కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేసారు. 50కోట్లు పెట్టి ఠాకూర్ పీసీసీ అమ్మాడు అని అప్పట్లో వాళ్లే విమర్శలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారని చెప్పుకొచ్చారు. ప్రజలు చాలా చైతన్యవంతులని.. ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసని చెప్పారు. తెలంగాణ లో ఎంఐఎం కి ఎవ్వరూ భయపడటం లేదని.. బీజేపీ భయపడుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు. కొత్త పార్టీలకు కేసీఆర్ మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయని.. ఢిల్లీ పార్టీల పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. టీఆరెస్ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల- ప్రవీణ్ కుమార్ పార్టీలని కేటీఆర్ విమర్శించారు.

KTR challenge amid the drug aleegations: Ready to face any test

తెలంగాణలో టీఆరెస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణ కుపెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి అగుతుందా అని ప్రశ్నించారు. ఎవ్వరిని వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. అందరికి భాగోతం మా దగ్గర ఉందని.. అన్ని బయట పెడుతామని స్పష్టం చేసారు. పీసీసీ కొనుకున్నోడు.. రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా అని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా అంటూ నిలదీసారు. ఇక, డ్రగ్స్ అంశం పైన కేటీఆర్ స్పందిస్తూ.. నాకు డ్రగ్స్ కు ఏం సంబంధం- నా రక్తం- వెంట్రుకలు ఇస్తా ఏ పరిక్షకైనా సిద్ధం- మరి రాహుల్ గాంధీ ఇస్తాడా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం- ఈడీ కి లెటర్ ఇచ్చిన వాడు బఫున్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం..అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతామని హెచ్చరించారు.సింగరేణి కాలనీ బాలిక ఘటన పై చట్టం తనపని తాను చేసుకుందని చెప్పారు. దిశ ఘటన పై దేశం హర్షించిందన్నారు. కప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి..ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోందని చెప్పారు. సీఎం ను పట్టుకొని తాగుబోతు అంటారా..మహారాష్ట్ర ప్రభుత్వంను ఇన్సపరేషన్ గా తీసుకుంటామని..వీళ్ల మీద కేసులు పెడతామని చెప్పారు. ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూన్ 2 తెలంగాణకు విమోచన దినోత్సవం అని చెప్పుకొచ్చారు.

English summary
Minister KTR sesnational comments on Drugs issue. He says ready for any test in drugs matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X