హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపిక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. టెక్నాలజీ వినియోగం, పరిపాలన, పారదర్శకతలను సమన్వయం చేస్తూ విధులు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ను స్కోచ్ సంస్థ ఈ ఏడాది చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది.

హైదరాబాద్‌లో టీహబ్ వంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, కొత్త భారతదేశ ఆవిష్కరణ కోసం పని చేస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

KTR chosen for ‘Skoch Challenger of the year Award’

కాగా గత 14 సంవత్సరాలుగా దేశంలోని ప్రముఖులు గుర్తిస్తున్న స్కోచ్ సంస్ధ అవార్డులను ప్రదాం చేస్తుంది. ఈ ఏడాది కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును బహూకరించనుంది. స్టార్టప్ ఇండియా విభాగంలో మంత్రి కేటీఆర్‌కు చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బహూకరించనున్నట్లు స్కోచ్ సంస్థ బుధవారం తెలిపింది.

గత ఏడాదిన్నర కాలంలో ఐటీ రంగంలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్ టీ హబ్ ఏర్పాటుచేయడం అభినందనీయమని పేర్కొంది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి, ఈ అవార్డును స్వీకరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

దీంతోపాటు స్టార్టప్‌లకు ఇవ్వాల్సిన మద్దతు అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ గవర్నర్ ఆర్ రంగరాజన్, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, హెచ్‌డీఎఫ్‌సీ మాజీ చైర్మన్ దీపక్‌పరేఖ్, ఆర్థిక నిపుణుడు విజయ్‌కేల్కర్ తదితరులు ప్రసంగించనున్నారు.

English summary
Minister for IT K.T. Rama Rao has been chosen for ‘Skoch Challenger of the year Award’ in the Start-Up India category for his work in establishing the path-breaking tech incubator T-Hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X