వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొగరు: జానా వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, నాకు సమాధానం చెప్పలేదు: కొండా సురేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/వరంగల్: తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలపై ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. జానా మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదని గతంలో జానారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR counter to Jana Reddy on Telangana Agitation comments

'కేసీఆర్ నేతృత్వంలో గుప్పెడు మంది అటూ ఇటూ ఆందోళన చేస్తే తెలంగాణ వచ్చిందా, అది జరగని పని. మేం అనుకొని ఉంటే అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఐదు నిమిషాల్లో అణిచివేసేవాళ్ళం' అని జానా అన్నట్లుగా ఉంది.

దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ... తాము తలుచుకుంటే ఐదు నిమిషాల్లో ఉద్యమాన్ని అణిచేసేవాళ్లమని జానారెడ్డి అంటున్నారని, అది ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి, పొగరుబోతుతనానికి నిదర్శనం అని విమర్శించారు.

కేసీఆర్‌పై కొండా సురేఖ ఆగ్రహం

తెలంగాణను మోసం చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా తాను ముందస్తుకు వెళ్తున్నానని తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను అడిగిన ఏ ప్రశ్నకు తెరాస సమాధానం చెప్పలేదని ఆమె అన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ సభకు దాదాపు 30వేల కంటే ఎక్కువ రారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వేరుగా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. గత అయిదు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

English summary
Senior Scamgress man Jana Reddy openly says they could’ve crushed Telangana agitation in 5 minutes. What feudal arrogance!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X