హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ktr farmhouse: 25 ఎకరాల్లో ఫాంహౌస్ అవసరమా? కేటీఆర్‌పై చర్యలేవి?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలికి వచ్చిన జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లో అక్రమాలు బయటపెట్టినందుకే రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవోను కేటీఆర్ ఉల్లంఘించారని మండిపడ్డారు. అసలు 25 ఎకరాల్లో కేటీఆర్‌కు ఫాంహౌస్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపురేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపు

25 ఎకరాల ఫాంహౌస్ అవసరమా?

25 ఎకరాల ఫాంహౌస్ అవసరమా?

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలికి వచ్చిన జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లో అక్రమాలు బయటపెట్టినందుకే రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవోను కేటీఆర్ ఉల్లంఘించారని మండిపడ్డారు. అసలు 25 ఎకరాల్లో కేటీఆర్‌కు ఫాంహౌస్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి..

మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి..

తెలంగాణలో 111 జీవో అమలవుతోందా? లేదా? అని జీవన్ రెడ్డి తెలంగాణ సర్కారును నిలదీశారు. ఈ జీవోను ఉల్లంఘించిన మంత్రి కేటీఆర్‌పై ముందుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు దొంగలను పట్టుకోవడం మానేసి ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేసి ఏం చేస్తారని పోలీసులను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన స్థలంలో ఆ యజమానిపై చర్యలు తీసుకోకుండా.. దాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటని నిలదీశారు. ఈ పరిణామం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.

డ్రోన్ వాడకం నేరమైతే..

డ్రోన్ వాడకం నేరమైతే..

డ్రోన్‌తో చిత్రీకరించడం నేరం అయినప్పుడు.. అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం కూడా నేరమే అవుతుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 111 ఉత్తర్వులను పరిరక్షించాల్సిన మంత్రులే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేస్తోందో తెలుస్తుందని అన్నారు.

Recommended Video

Revanth Reddy Arrest Exclusive Visuals | Oneindia Telugu
కేటీఆర్ ఫాంహౌస్ వద్ద రేవంత్ రెడ్డి హల్‌చల్

కేటీఆర్ ఫాంహౌస్ వద్ద రేవంత్ రెడ్డి హల్‌చల్

మూడు రోజుల క్రితం(సోమవారం) రేవంత్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో 111జీవో పరిధిలో ఉన్న కేటీఆర్ ఫాంహౌస్ ను పరిశీలించేందుకు మీడియాతో కలిసి వెళ్లారు. మంత్రి కేటీఆర్ బినామీ పేర్లతో ఫాంహౌస్`లో అక్రమంగా కట్టడాలు కడుతూ, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని.. ఈ కట్టడాలను వెంటనే కూల్చాలనే డిమాండ్ చేశారు. మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాగా, భద్రతా కారణాలరీత్యా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరపర్చారు. దీంతో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.

English summary
ktr farmhouse and revanth reddy arrest: jeevan reddy fires at ktr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X