హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్ముడు లోకేష్! మీది మీరు చూసుకోలేరు కానీ: బాబుకు కెటిఆర్ చురక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, టిడిపి నేత నారా లోకేష్‌పై తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కెటిఆర్ బుధవారం ఐటి కంపెనీల సిఈఓల సమావేశంలో మాట్లాడారు.

తమ్ముడు లోకేష్ అంటూ కెటిఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రంలో తామే ఉన్నామని, నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని లోకేష్ చెబుతున్నారని.. అయితే అమరావతికి నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు.

ఏపీ సీఎం ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని వెళ్లారని చెప్పారు. అమరావతికి వచ్చిన ప్రధాని.. తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు చల్లిపోయారని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రానికి ఏం తేలేని మీరు, హైదరాబాద్‌కు ఏదో చేస్తామంటే ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు.

ktr-lokesh

హైదరాబాద్ నగరాన్ని చూసుకోవడానికి సీఎం కెసిఆర్, తాము ఉన్నామని చెప్పారు. తాము చంద్రబాబును, మిమ్మల్ని కూడా ఇక్కడ సేఫ్‌గా చూసుకుంటామని, ఇక్కడే ఉండొచ్చని కెటిఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో ఐటిని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతుంటారని, ఏ ఒక వ్యక్తి వల్లో, ప్రభుత్వం వల్లో మొత్తం సాధ్యం కాదని అన్నారు. అయితే బెంగళూరు.. హైదారబాద్ కంటే ఐటిలో ఎక్కువ అభివృద్ధి సాధించిందని, దానికి ఏం కారణం చెబుతారని ప్రశ్నించారు.

చంద్రబాబు 1996-2004 వరకు సీఎంగా ఉన్నారు కాబట్టి.. ఐటి అభివృద్ధికి ఆయన కొంత సహాయం చేశారని చెప్పారు. అయితే ఆయన వల్లే ఐటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. చంద్రబాబు.. ఇంటర్నెట్‌ను కూడా తానే తయారు చేశానంటూ డబ్బా కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు ఉబెర్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, ఇదంతా తన వల్ల, కెసిఆర్ వల్ల కాదని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నందువల్లేనని చెప్పారు. ఐటి వాళ్లు ఓటేయరనే అభిప్రాయం ఉందని, దాన్ని తుడిచేయాలని ఐటి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను గెలిపిస్తే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

English summary
Telangana Minister KT Rama Rao on Wednesday fired at AP CM and TDP president Chandrabab Naidu and Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X