హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కసీటు కూడా కీలకమే, చంద్రబాబుకు-కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెరాస 16 సీట్లు గెలిస్తే ఢిల్లీని గడగఢలాడించవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం చెప్పారు. దేవరకద్ర స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఏకిపారేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తెచ్చే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి బిల్డప్ ఎక్కువ, చేసేది తక్కువ అని ఎద్దేవా చేశారు. మోడీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీజేపీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. ఆ రెండు పార్టీలకు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని సీట్లు రావని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పట్ల ప్రజలు ఏమాత్రం సంతృప్తికరంగా లేరని చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్! ముసుగు తొలగించు, దేవాలయాల్లో గంటలు మోగుతాయి.. ఇదే భారత్: అసదుద్దీన్ హెచ్చరికఇమ్రాన్‌ఖాన్! ముసుగు తొలగించు, దేవాలయాల్లో గంటలు మోగుతాయి.. ఇదే భారత్: అసదుద్దీన్ హెచ్చరిక

 వచ్చేసారి ప్రాంతీయ పార్టీలదే హవా

వచ్చేసారి ప్రాంతీయ పార్టీలదే హవా

దేశంలో కాంగ్రెస్, బీజేపీలు తప్ప వేరే పార్టీలు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో వచ్చే ఎన్నికల అనంతరం ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్‌లోకి పలు ప్రాంతీయ పార్టీలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా

నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా

ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎవరో ఒకరి పొత్తు లేకుండా చంద్రబాబు బతకలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు.

 పాము, ముంగీస ఒక్కటయ్యాయి

పాము, ముంగీస ఒక్కటయ్యాయి

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని కేటీఆర్ అన్నారు. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ఢిల్లీని గడగడలాడించి మనం అడిగింది ఇచ్చేలా చేశారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు కూడా రావని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా కీలకమేనని చెప్పారు. ఢిల్లీని పాము, ముంగీసలా చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక్కటయ్యారని చెప్పారు. ప్రజా కూటమి పేరుతో తెలంగాణలో హడావుడి చేశారన్నారు.

English summary
TRS working president KT Rama Rao on Monday fired at PM Narendra Modi, AICC president Rahul Gandhi and AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X