వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని మొదలుపెట్టిన కేటీఆర్.. అండగా ఉంటానని క్యాడర్ కు భరోసా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కల్వకుంట్ల తారకరాముడు రంగంలోకి దిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీఆర్ కారు స్పీడును పెంచేశారు. సన్నిహితులు ప్రేమతో రామన్నగా పిలుచుకునే కేటీఆర్ కాస్తా "బల"రాముడిగా మారుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో ఇలా పార్టీ బరువును భుజస్కందాలపై వేసుకున్నారు. తొలిరోజు నుంచే పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు.

అందుబాటులో ఉంటా.. అండగా నిలుస్తా అంటూ పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు కేటీఆర్. యువనేతగా క్యాడర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెచ్చిన సంబురం ఇకపై కూడా అలాగే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

"బల"రాముడిగా మారుతారా?

2014లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు కేటీఆర్. తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న వాక్చాతుర్యం ఆయనను యంగ్ లీడర్ గా నిలబెట్టింది. చూడగానే ఆకట్టుకునే రూపం.. సందర్భానుసారంగా కనబరిచే మానవత్వం.. వెరసి ఈ తారకరాముడు మంత్రిగా మంచి మార్కులే కొట్టేశారు. ఆపదలో ఉన్న వారికి ట్విట్టర్ వేదికగా సాయమందించారు. అలా ఒక్కటని కాదు ఎన్నో విషయాల్లో ఆయనకు మైనస్ పాయింట్ల కంటే కూడా ప్లస్ పాయింట్లే ఎక్కువ. పార్టీలో కూడా ఆయన పట్ల పెద్దగా వ్యతిరేకత కనిపించదు. వయస్సులో తనకన్నా పెద్దోళ్లను గౌరవిస్తూ.. చిన్నోళ్లను అభిమానిస్తూ ముందుకెళ్లడమే ఆయనకు తెలిసిన విద్య. చిల్లర రాజకీయాలకు ఆయన చాలా దూరమని సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు ఒకటి రెండు సార్లు చూస్తే చాలు పేర్లు పెట్టి పలకరించడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. మొత్తానికి తారకరాముడు పార్టీలో "బల"రాముడిగా మారే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

పెద్ద మనసు.. పెద్ద బాధ్యత

పెద్ద మనసు.. పెద్ద బాధ్యత

అన్న అంటే చాలు గుండెల్లో గుప్పెడంత చోటు కల్పించే యువనేతగా గుర్తింపు పొందారు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గానీ, పార్టీ కార్యక్రమాలు గానీ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని వంద శాతం కచ్చితత్వంతో పూర్తిచేసిన ఘనత ఆయన సొంతం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అసంతృప్తులను ఎక్కడికక్కడ బుజ్జగించి దారిలోకి తెచ్చుకున్న ఆకర్షణ మాంత్రికుడు కేటీఆర్.

ఆయన గురించి బాగా తెలిసినవాళ్లు, సన్నిహితులు పెద్ద మనసున్న నేత అని చెబుతారు. ఆ పెద్ద మనస్సే ఇప్పుడు ఆయనకు పెద్ద బాధ్యత తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆషామాషీ కాదు. కార్యకర్తల దగ్గర్నుంచి బడా నేతల వరకు అందర్నీ కలుపుకొనిపోవాలి. పార్టీ వ్యవహారాల్లో మమేకమవుతూనే అటు క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కాపాడుకోవాలి. అలాంటిది ఎంత నమ్మకముంటే కేసీఆర్ ఆయన తనయుడికి ఈ పదవి ఇచ్చి ఉండాలి.

కారు స్టీరింగ్ బ్యాలెన్స్ అయ్యేనా?

కారు స్టీరింగ్ బ్యాలెన్స్ అయ్యేనా?

వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే సమయంలో వచ్చిన జన ప్రభంజనమే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచే పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. దీన్నిబట్టి పని పట్ల ఆయన నిబద్ధత ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అయితే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఆయన ముందున్న అతి పెద్ద సవాళ్లు. అంతేకాదు పార్టీ సభ్యత్వాలు పెంచడం.. ఉన్న క్యాడర్ ను కాపాడుకోవడం.. మండల, జిల్లా స్థాయి కార్యవర్గాలు ఏర్పాటు చేయడం.. నామినేటెడ్ పదవుల పంపకం.. అసంతృప్తులను బుజ్జగించడం.. ఇవన్నీ కారు స్టీరింగ్ కొత్తగా పట్టుకున్న తారకరాముడు ఎలా బ్యాలెన్స్ చేస్తారో మరి.

English summary
TRS party working president KTR has been started progressive work. The first day of taking responsibilities was focused on party affairs. He guaranteed to party workers as helping hand in any time. Overall, this tarakaramudu has become a balaramudu in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X