వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పలేం: ఏపీలో పోటీపై కేటీఆర్, ఇక్కడ మీరు, ఏపీకి ఎవరంటే.. మానేశానని షాకింగ్ జవాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ట్విట్టర్ ద్వారా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్.. సెలవు రోజున ట్విట్టర్ చాట్‌లో పాల్గొని, రాజకీయ, సినిమా.. ఇలా అన్ని రంగాలకు సంబంధించి నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు

ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారా అంటే.. ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లిహిల్స్ లేదా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తారా అని అడిగితే.. సిరిసిల్ల ప్రజలు తనను మూడుసార్లు గెలిపించారని చెప్పారు. వారి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు.

ఏపీలో పోటీపై.. ఏం జరుగుతుందో చెప్పలేం

2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని చాలామంది యువకులు కోరుకుంటున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉండటంపై స్పందిస్తూ ఏపీకి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే కేవలం 0.09తో మాత్రమే తెలంగాణ వెనుకబడిందని చెప్పారు. నల్గొండ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలు గెలుస్తామని ఆకాంక్షించారు. వచ్చే తెలంగాణ సీఎం కేసీఆరే అని చెప్పారు.

నా వద్ద మీరేం చేస్తారో నాకైతే తెలియదు

తాను లా చదువుతున్నానని, మీ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నానని, దరఖాస్తు చేశానని, తనను తీసుకుంటారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. లా విద్యార్థి నా వద్ద ఏం ఇంటర్న్‌షిప్ చేస్తాడో నాకు తెలియదని, దరఖాస్తు పత్రాలు పరిశీలించమని నా టీంకు చెప్తానని అన్నారు. నిజాం కాలేజీ అద్భుతమైన కాలేజీ అని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

వీలైతే మొక్కను నాటండి

భారత యువత గురించి ఒక్క మాటలో చెప్పమని అగగా.. పవర్ ఆఫ్ యూత్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ఇష్టమైన క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్ అని, నేను వారి తరం నుంచే వచ్చానని చెప్పారు. ఓ రాజకీయ నాయకుడిగా ఏం సాధించారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రిటైర్ అయ్యాక చెప్తానని అన్నారు. నచ్చిన హాస్యనటుడు అని ఓ నెటిజన్ అడగ్గా.. రాజకీయాల్లోనా అని సరదాగా అన్నారు. జూలై 24న మీ బర్త్ డే సందర్భంగా నెక్లెస్ రోడ్డులో కేక్ కట్ చేద్దామనుకుంటున్నామని, మీరు రావాలని కోరుకుంటున్నామని ఓ నెటిజన్ కోరగా.. వీలైతే ఓ చెట్టు నాడాలని, కేక్స్, పోస్టర్లు వద్దని చెప్పారు.

దానికి సమాధానం మీకు తెలుసు

మహేష్ కత్తి, పరిపూర్ణానంద స్వామిల నగర బహిష్కరణలపై స్బందిస్తూ.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడేది లేదని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రుల్లో వైయస్సార్ గొప్పా, కేసీఆర్ గొప్పా అని ఓ నెటిజన్ అడగగా.. సమాధానం మీకు తెలుసునని కేటీఆర్ చెప్పారు. ఈ స్థానాలు శాశ్వతం కాదని, కళ్లుమూసి తెరిచేలోగా మాయమవుతాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్విట్టర్‌లో ఎప్పుడు ప్రశ్నించినా త్వరగా స్పందిస్తారని, అంత బిజీ షెడ్యూల్లో ఎలా స్పందించగలుగుతారని ఓ నెటిజన్ ప్రశంసించగా.. మీరు కొన్ని సందర్భాల్లో విమర్శలు చేసినా సంతోషమే అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా కావాలంటే

జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రపంచం మొత్తంలో తనకు నచ్చిన రాజకీయ నాయకుడు బరాక్ ఒబామా అన్నారు. మీరు తమిళనాడు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నామని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అది అసాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు కావాల్సిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఫిల్లింగ్ ది బ్లాంక్స్ మానేశా

తెలంగాణకు కేటీఆర్ ఉన్నారని, మరి ఆంధ్రప్రదేశ్‌కు ఎవరు... అంటూ ప్రియ అనే యువతి ఖాళీలను పూరించండి అన్నట్లుగా ప్రశ్నించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. నేను కాలేజీని వదిలేశాక ఫిల్లింగ్ ది బ్లాంక్స్ (ఖాళీలను పూరించండి)ని ఆపేశానని చెప్పారు. లెఫ్ట్ రాజకీయాల (వామపక్షాలు) గురించి మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. ప్రజలు వారిని ఎప్పుడో వదిలేశారని చెప్పారు.

English summary
Telanana IT Minister KT Rama Rao interacted with netizens on Twitter on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X