వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైస్పీడ్‌ రైలులో మంత్రి కెటిఆర్ టూర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణకొరియా రాజధాని సియో‌ల్ పట్టణం నుండి డ్యాగు పట్టణానికి హైస్పీడ్ ట్రైన్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పర్యటించారు.రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కెటిఆర్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.

భారత్‌లోని రెండవ రకం పట్టణాల మధ్య అనుసంధానం కావాలంటే హై స్పీడ్ రైళ్ళు ఎంతో అవసరమని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రధాన నగరాల మధ్య దూరం తగ్గడంతో పాటు త్వరగా ఆయా పట్టణాలకు చేరేందుకు హై స్పీడ్ రైళ్ళు ఉపయోగపడతాయనికెటిఆర్ అభిప్రాయపడ్డారు.

KTR And Govt Advisor G Vivek Travels In High-Speed Train In South Korea

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ఈ విషయాలను వెల్లడించారు.గంటలకు 300 కి.మీ . వేగంతో ప్రయాణించే రైలులో మంత్రి కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వివేక్, ప్రభుత్వాధికారులు మంత్రి వెంట రైలులో ఉన్నారు.

కెటిఆర్ ప్రయాణం చేసిన హై స్పీడ్ రైలు సియోల్ నుండి డ్యాగ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 417.5 కి.మీ. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొరియన్‌ ట్రెయిన్‌ ఎక్స్‌ప్రెస్‌ (కేటీఎక్స్‌)కు చెందిన హైస్పీడ్‌ ట్రెయిన్‌.. రెండు గంటల పది నిమిషాల్లో వ్యవధిలోనే గమ్యానికి చేరుకుంటుంది.

తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని దక్షిణ కొరియా పారిశ్రామిక వేత్తలను ఆహ్వనించినట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. డ్యాగు పట్టణంలో వ్యాపార ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల విషయమై చర్చించినట్టు కెటిఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

English summary
Telangana I.T. minister KTR Travelled on high speed train from seoul to Daegu. he is in South korea tour for investments in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X