వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video: మాస్కు ఇస్తే.. మడిచి జేబులో పెట్టుకున్నారు: పద్మారావుకు కరోనాపై కేటీఆర్ ఆసక్తికరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఓ ఘటనను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. చెబితే వినకపోవడం వల్లే పద్మారావుకు కరోనా వచ్చిందన్నారు.

మాస్కు ఇస్తే.. మడిచి..

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయం గురించి ప్రజలతో పంచుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తాను పద్మారావుకు మాస్కు ఇచ్చానని తెలిపారు. అయితే, పద్మారావు ఆ మాస్కును ధరించకుండా ప్యాంటు జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు.

అందుకే పద్మారావుకు కరోనా..

అందుకే పద్మారావుకు కరోనా..

ఏం కాదు.. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారని పద్మారావు చెప్పుకొచ్చారని తెలిపారు. చివరికి ఇప్పుడు పద్మారావుకే కరోనా సోకిందని కేటీఆర్ చెప్పారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటే మనతోపాటు మన కుటుంబం కూడా కరోనా బారిన పడదని అన్నారు. కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికివారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కరోనా నుంచి రక్షణ కోసం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ డాక్టర్లలా సలహాలిచ్చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

Recommended Video

#WhereisKcr : KCR ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన.. కన్ఫ్యూజన్ లో నెటిజన్స్! || Oneindia Telugu
ఆ గొంతు తనది కాదంటూ పద్మారావు క్లారిటీ..

ఆ గొంతు తనది కాదంటూ పద్మారావు క్లారిటీ..


కాగా, కరోనావైరస్‌కు ఇంటి చికిత్స అంటూ పద్మారావు గౌడ్ తన అనుచరుడు ఒకరితో మాట్లాడుతున్నట్లుగా ఓ ఆడియో క్లిప్ గత కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది.
ఇందులో కరోనా చికిత్స కోసం సొంటి, లవంగాలు, యాలకులు, ఇంకా మరిన్ని పదార్థాలు కలిపి దంచి పొడిచేసుకుని దాన్ని వేడి నీటితో కలిపి రోజూ తీసుకోవాలని సూచించినట్లుంది. ఇది వైరల్ గా మారడంతో దీనిపై పద్మారావు కూడా స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌ ఉన్న వాయిస్ తనది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరి ఆశీర్వాదాలతో తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు పద్మారావు తెలిపారు.

English summary
ktr interesting comments on corona positive for deputy speaker padmarao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X