వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై కెటిఆర్ ఆసక్తికరం: వ్యతిరేకవార్తల్లో తప్పులేదు, టీవిల్లో అర్ధవంతమైన చర్చలు అరుదు

టీవి ఛానళ్ళలో అర్ధవంతమైన చర్చలు, వాదనలు అరుదుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటిఆర్ అబిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీవి ఛానళ్ళలో అర్ధవంతమైన చర్చలు, వాదనలు అరుదుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటిఆర్ అబిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకొన్నారు.

టీఆర్ పీ రేటింగ్ కోసం టీవి చానళ్ళు ప్రయత్నాలు చేస్తుంటాయన్నారు. వ్యతిరేక వార్తలు రాస్తే టీఆర్ పీ లు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ రకమైన వార్తలకోసం టీవి ఛానళ్ళు ప్రయత్నిస్తుంటాయేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

KTR intresting comments on Tv debates

మీడియాలో పనిచేస్తున్న వారు సంతోషంగా లేరని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన చానెల్ ను ఆయన ఉదహరణగా చెప్పుకొచ్చారు. తమను తాము చూసుకొని మురిసిపోయే యాంకర్ల స్వగతంలో పాల్గొనలేనన్నారు.

అర్ధవంతమైన చర్చలు, వాదనలు టీవి చర్చల్లో చాలా అరుదు అంటూ ఆయన తెలుగు టీవి చానళ్ళలో చర్చా కార్యక్రమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఇదంతా మనంచేసే ఉద్యోగ ధర్మమే కావచ్చు. మీడియాను కూడ తప్పుబట్టలేమన్నారు.

తెలుగు మీడియా చానళ్ళలో డిబేట్లపై కెటిఆర్ తన వైఖరిని ప్రకటించారు. అయితే టీవి డిబేట్లలో పాల్గొనేందుకు కొందరు నాయకులు దూరంగా ఉంటారు. మరికొందరు ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు.

కానీ, ఆకస్మాత్తుగా కెటిఆర్ టీవి చానెళ్ళ డీబెట్లపై ఎందుకు తన అభిప్రాయాలను వెల్లడించారో అర్ధం కావడం లేదు.

English summary
Telangana minister KTR intresting comments on Tv debates , Very few meaningful discussions debates on Tv these days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X