వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశుధ్యంపై సీరియస్ అయిన కేటీఆర్ .. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి వార్నింగ్

|
Google Oneindia TeluguNews

నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దేవరకొండ మున్సిపాలిటీ పైన పటారం లోన లొటారం అన్నట్టు వుందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, చైర్మన్ , కమీషనర్ పై అసహనం వ్యక్తం చేశారు .మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌, రోడ్లు, పార్క్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు

ఇక పొడి, తడి చెత్తను వేరుచేయడానికి 8 వేల ఇళ్లల్లో ప్రతి ఇంటికి రెండు డబ్బాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పరిచయం కార్యక్రమంతో సిబ్బందితో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.దేవరకొండ మున్సిపాలిటీలో పరిస్థితి బాగా మెరుగుపడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం కేవలం పచ్చదనం కోసమే వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు . 80 శాతం మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

Recommended Video

Telangana Municipal Elections : TRS Sweeps Municipal Polls By Using Money || Oneindia Telugu

పారిశుద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానా


వార్డుల్లో మొక్కల పెంపకానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూరగాయల మార్కెట్, పార్క్, శ్మశానవాటికలు నిర్మించాలన్నారు.తాగునీటి నిర్వహణ వ్యవస్థపై వార్డు సభ్యులు సమీక్షించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపి సురక్షితమైన నీరందించాలన్నారు. నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించాలని పేర్కొన్నారు. అక్కడ చెత్తా చెదారం ఎక్కడివి అక్కడే పేరుకుపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . పారిశుధ్య పనులపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌, కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానా విధించాలని అధికారులకు కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

English summary
Today, the Minister of IT and Municipal Affairs KTR toured the Nalgonda district. Minister KTR participated in the pattana pragathi program in the Nalgonda district Deverakonda Municipality. He was embarrassed that the cleanlyness not found in the municipality. Minister KTR impatience on The councilors, the chairman and the commissioner .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X