హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ గట్టునేమో స్కాములు.. ఈ గట్టునేమో స్కీములు: కాంగ్రెస్, టీడీపీలపై కేటీఆర్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.

చంద్రబాబూ గుర్తుందా? నాటి ఆణిముత్యాలు!: ఏకిపారేసిన కేటీఆర్చంద్రబాబూ గుర్తుందా? నాటి ఆణిముత్యాలు!: ఏకిపారేసిన కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీలోకి టీడీపీ నేతలు

టీఆర్ఎస్ పార్టీలోకి టీడీపీ నేతలు

బుధవారం మహబూబ్‌నగర్, దేవరకొండ ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణలో టీడీపీ చచ్చిపోయినందుకే మీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఈ సందర్భంగా వారితో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 60రోజులు టీఆర్ఎస్‌తో ఉంటే.. 60నెలలు మీ కోసం పనిచేస్తాం

60రోజులు టీఆర్ఎస్‌తో ఉంటే.. 60నెలలు మీ కోసం పనిచేస్తాం

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. 60రోజులు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తే.. 60నెలలు తెలంగాణ కోసం తాము పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని అన్నారు. 1956లో తెలంగాణను ఏపీతో కలిపిన తర్వాత దేవరకొండ, మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య వచ్చిందని, అంతకుముందు ఇక్కడ ఆ సమస్యే లేదని కేటీఆర్ తెలిపారు. 1956-2014 వరకు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాపం కారణంగానే ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నారని తెలిపారు.

ఆ గట్టునే స్కాములు.. ఈ గట్టునేమో స్కీములు

ఆ గట్టునే స్కాములు.. ఈ గట్టునేమో స్కీములు

ఈ సందర్భంగా రంగస్థలంలోని ‘ఆ గట్టునేమో..' అనే పాటను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను పొల్చారు. ఆ గట్టునేమో కరెంటు ఇవ్వలేదు.. ఈ గట్టునేమో 24గంటలు కరెంటు ఇచ్చిన కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ‘అటు రైతులను కాల్చి చంపిన పార్టీలు.. ఇటేమో రూ.8వేలు ఇస్తున్న కేసీఆర్ ఉన్నారు. ఆ గట్టున స్కాములు... ఈ గట్టునేమో స్కీములున్నాయి. 450పథకాలున్నాయి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 నల్గొండ దరిద్రం వారే...

నల్గొండ దరిద్రం వారే...

‘ఉమ్మడి నల్గొండ దరిద్రమేమంటే.. పెద్ద పెద్ద నాయకులున్నారు కానీ.. అభివృద్ధి మాత్రం శూన్యం. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులే. ఫ్లోరోసిస్ ఉన్నా ఏం చేయలేదు. పక్కనే ఉన్న కృష్ణ నీళ్లను కిరణ్ కుమార్ రెడ్డి తరలించుకుపోతున్నా.. ఒక్కమాట కూడా అడగలేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఉత్తుత్తి మాటల కుమార్ రెడ్డి అని గుర్తిస్తారు' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

 కిరాయిలు కడతరట

కిరాయిలు కడతరట

‘టీఆర్ఎస్ ఏదంటే దానికి రెండు రేట్లు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వేలంపాట లెక్క. నిజాయితీ ఉంటే.. 67ఏళ్లు ప్రభుత్వంలో ఉండి చేశారు? కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఎందుకివ్వడం లేదు? కేసీఆర్ ఏదంటే దానికి డబుల్ అంటున్నారు. ఇక బీజేపీ మరీ అధ్వాన్నం.. ఇంటి కిరాయిలు కూడా కడతారట. మోడీ 15లక్షలిస్తే ప్రజలే కట్టుకుంటారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 ఓటెస్తో కాంగ్రెసోళ్లు దొరుకుతార? బంగాళాఖాతంలో కలపండి..

ఓటెస్తో కాంగ్రెసోళ్లు దొరుకుతార? బంగాళాఖాతంలో కలపండి..

ఒక్కసారి ఓటు వేసిన తర్వాత కాంగ్రెసోళ్లు దొరుకుతర? తులం బంగారం ఇస్తామని కూడా అంటరు.. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచించే రవీంద్ర కుమార్‌ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. తాము కూడా మరింత ఉత్సాహంగా అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని అన్నారు.

మాయా కూటమికి ఓటేసి ఎన్టీఆర్ ఆత్మను క్షోభింపచేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించి, బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.

కాంగ్రెస్‌ను పాక్ క్రికెట్ టీంతో పోల్చిన కేటీఆర్

కాంగ్రెస్‌ను పాక్ క్రికెట్ టీంతో పోల్చిన కేటీఆర్

టీ-కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ క్రికెట్ లాంటిదని కేటీఆర్ అన్నారు. పాక్ క్రికెట్ టీమ్ అని ఎందుకంటున్నానంటే.. ఒకరు కెప్టెన్‌గా ఉంటే.. టీమ్‌లో మిగిలిన వారు మాజీ కెప్టెన్‌లు ఉన్నారని అన్నారు. వాళ్ల పార్టీలో సుమారు ముప్పై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారని, పక్కింటి వాళ్లు కూడా ఓట్లెయ్యని వాళ్లు కూడా సీఎం అభ్యర్థిని కావాలని కోరుకునే వారు ఆ పార్టీలో చాలామందే ఉన్నారని విమర్శించారు. ఒకవైపు ఎన్నికలకు సిద్ధమంటారు, మరో వైపు కోర్టుకు పోయి బ్రతిమలాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలపై సెటైర్లు విసిరారు. ‘అయ్యా ఎన్నికలు వాయిదా వేయండి.. జల్దీగా ఎన్నికలు పెడితే ప్రజలు వీపు పగలగొట్టేట్టు ఉన్నారని బతిమలాడుతున్నారు' అంటూ కాంగ్రెస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్.

English summary
Telangana minister KT Rama Rao on Wednesday lashed out at Congress and TDP alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X