హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగా? కేసీఆర్ వెంట్రుక పీకలేరు: కేటీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మంత్రి కేటీఆర్ మంగళవారం నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్ గేట్లు తెరవరని కొందరు అంటున్నారని, ప్రగతిని అడ్డుకునే వారికి ప్రగతి భవన్‌తో పని ఏమిటన్నారు.

ప్రగతి భవన్‌కు ప్రగతి నిరోధకులు రావడం ఎందుకని ప్రశ్నించారు. కార్మికులకు, కన్నీటితో బాధపడేవారికి ప్రగతి భవన్ అండగా ఉంటుందన్నారు. సింగరేణి కార్మికులు, అంగన్వాడీలకు చోటు ఉంటుందన్నారు.

KTR lashes out at Uttam and Kodandaram

గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్ సింగ్ అవుతారా అని ఎద్దేవా చేశారు. సీఎంను, ఆఖరికి మా ఇంట్లో చిన్న పిల్లలను కూడా తిడుతున్నారన్నారు. గడ్డం పెంచుకున్నోళ్లు, ప్రగతి భవన్ గేట్లు ధ్వంసం చేస్తామన్న వాళ్లు ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరన్నారు.

కండ్లకోయ జంక్షన్‌ను ప్రారంభించిన కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కి.మీ. పొడవు గల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది.

English summary
Telangana IT minister KT Rama Rao lashed out at Uttam Kumar Reddy and Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X