హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ -వ్యాలెట్ ను ప్రారంభించిన కెటిఆర్, డిజిటల్ చెల్లింపులు ఇక సులభం

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీ వ్యాలెట్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్ లో గురువారం నాడు ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ డిజిటల్ వ్యాలెట్ ను ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీ వ్యాలెట్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్ లో గురువారం నాడు ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ డిజిటల్ వ్యాలెట్ ను ప్రారంభించారు.

నగదురహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ వ్యాలెట్ ద్వారా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ చెల్లింపులు జరుపుకోవచ్చు. ఫోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది.

KTR launches T- wallet in Hyderabad

ఆధార్ ఫస్ట్ బయోమెట్రిక్, ఆధార్ ప్లస్ మొబైల్ ఓటిపి ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆసరా, ఉపాధిహామీ పథకాల ద్వారా వచ్చే నగదును నేరుగా యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.

తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీష్ బాషల్లో టీ వ్యాలె్ ను రూపొందించారు. స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ లేకుండానే యాప్ ను ఉపయోగించుకోవచ్చు. మీ సేవ ద్వారా వ్యాలెట్ లో డబ్బువేసుకోవచ్చు. యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఉచితం.

టీ వ్యాలెట్ అన్ని ప్రభుత్వ చెల్లింపులను చేసుకోవచ్చు. కరెంట్, వాటర్, జీహెచ్ ఎంసీ, ఆస్తిపన్ను, డీటిహెచ్, ల్యాండ్ లైన్, మొబైల్ రీ చార్జీలు, ఇంటర్నెట్ బిల్లులను చెల్లించుకోవచ్చు.

ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఫీజులు కూడ చెల్లించవచ్చు. నగదును కూడ ఎలాంటి చార్జీ లేకుండా ఇతరులకు పంపవచ్చు.

English summary
Telangana IT minister KTR launched T- wallet in Hyderabad on Thursday. It's useful for digital payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X