• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏకాగ్రత కోల్పోయిన కేటీఆర్..! ట్వీట్లలో గందరగోళం..! గ్లోబరీనా ఇచ్చిన షాకేనా..!?

|

హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రగిన్చిన చిచ్చు నేతల ఏకాగ్రతకు శరాఘాతంగా మారుతోంది. తూటాల్లాంటి మాటలు, ఈటెల్లాంటి ట్వీట్లు చేసే నేతలకు కూడా ఇంటర్ ఇచ్చిన షాక్ కు దిమ్మతిరిగిపోయినంత పనయినట్టు చర్చ జరుగుతోతంది. ఇక ప్రతిపక్షాల పట్ల జెట్ వేగంతో విమర్శనాస్త్రాలు సంధించే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తారక‌రామారావు ట్వీట్లలో స్పష్టత లోపిస్తోంది. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఇచ్చిన జ‌వాబులు ప‌రిశీలిస్తే కేటీఆర్ ఏం చెప్పాలనుకుని, ఏం చెప్పారనే చర్చను కూడా నెటిజన్లు షేర్ చేసుకున్నారు. దీంతో కేటీఆర్ ట్వీట్లలో ఎంతటి తికమక చోటుచేసుకుందో అర్థం అవుతుందనే చర్చ జరుగుతోంది.

కేటీఆర్ ట్వీట్లలో గందరగోళం..! పొంతనలేని సమాధానాలంటూ కేటీఆర్ పై నెటిజన్ల అసహనం..!!

కేటీఆర్ ట్వీట్లలో గందరగోళం..! పొంతనలేని సమాధానాలంటూ కేటీఆర్ పై నెటిజన్ల అసహనం..!!

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో వారం ప‌ది రోజుల్లో పదోత‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇటువంటి కీల‌కమైన స‌మ‌యంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు తీసుకున్న నిర్ణ‌యాలు కూడా వేలెత్తిచూపేలా ఉన్నాయి. అయితే గ్లోబరీనా త‌ప్పిదానికి ఇంత‌మంది పిల్ల‌లు బ‌ల‌య్యారంటూ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్లు గ‌గ్గోలు పెడుతుంటే కేటీఆర్ కు మాత్రం అస‌లు ఆ గ్లోబ‌రీనా ఎవ‌రిదో తెలియ‌దంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంచేశారు.

గ్లోబరీనా నా.. అదెక్కడి సంస్థ..! ఎదురు ప్రశ్నించిన కేటీఆర్..!!

గ్లోబరీనా నా.. అదెక్కడి సంస్థ..! ఎదురు ప్రశ్నించిన కేటీఆర్..!!

ఎక్క‌డో జూబ్లీహిల్స్‌లో ప‌బ్‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించాయంటూ కేటీఆర్ ఆర్డరేస్తే మూసివేశారు. అదే.. గ్లోబ‌రీనా సంగ‌తి మాత్రం తెలియ‌దంటూ స‌మాధానం ఇవ్వ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పైగా అది కేటీఆర్ స‌న్నిహితుల‌దే అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న వేళ కేటీఆర్ స‌మాధానం వెనుక అంత‌రార్ధం ఏమిట‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఏపీలో తాము వేలు పెడ‌తాం.. అక్క‌డా రాజ‌కీయం చేస్తామంటూ నిన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ నామ‌మ‌ంత్రం జ‌పించిన కేటీఆర్‌.. ఏపీలో ఎవ‌రు అధికారంలోకి రాబోతున్నారంటూ అడిగితే.. అది నా ప‌రిధిలోనిది కాద‌ని సమాధానం చెప్పడం కొసమెరుపు..!

ఏపి గెలుపోటములతో నాకు సంబంధం లేదు..! విచిత్ర సమాధానం ఇచ్చిన కేటీఆర్..!!

ఏపి గెలుపోటములతో నాకు సంబంధం లేదు..! విచిత్ర సమాధానం ఇచ్చిన కేటీఆర్..!!

అక్క‌డ గెలిచే ఎమ్మెల్యేలు ఎవ‌రైనా సీఎం కావ‌చ్చంటూ విశ్లేషించారు. ఇంత‌లో అంత గొప్ప మార్పు ఎందుకు వ‌చ్చిందా అంటూ.. ఏపీలో తెలుగు త‌మ్ముళ్లు కూడా విశ్లేషించుకుంటున్నార‌ట‌. ఏపీలో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని స‌ర్వేలు చేయించినా.. తాజాగా టీడీపీకే జ‌నం మ‌ద్ద‌తు చెప్పార‌ని.. ఓటింగ్‌శాతం పెరిగేందుకు కార‌ణం. రెండోసారి చంద్ర‌బాబు సీఎం కావ‌టానికే నంటూ కేటీఆర్ కామెంట్స్‌కు త‌మ‌కు అనుగుణంగా మార్చుకున్నారు.

కేసీఆర్ స్వరం ఎందుకు మారింది..! ఏపి లో పెద్ద యెత్తున జరుగుతున్న చర్చ..!!

కేసీఆర్ స్వరం ఎందుకు మారింది..! ఏపి లో పెద్ద యెత్తున జరుగుతున్న చర్చ..!!

ఇక కేటీఆర్ ట్వీట్ల‌కు మాత్ర‌మే స్పందించే అధికారులు.. మిగిలిన వారికీ ఆ విలువ ఇవ్వాలంటూ ఎవ‌రో నెటిజ‌న్ భ‌లే ప్ర‌శ్న వేశాడంటున్నారు. ఏదో అనుకుని.. ఇంకేదో అయింద‌న్న‌ట్టుగా.. కేటీఆర్ జ‌వాబులు.. ఏపీలో తెలుగుదేశం గెల‌వ‌బోతుంద‌నే సంకేతాలు ఇచ్చేంత వ‌ర‌కూ వెళ్ల‌టం.. యాదృచ్చ‌క‌మే అయినా.. అదే జ‌రిగితే కేసీఆర్ స‌ర్కారు గొంతులో వెల‌క్కాయ ప‌డిన‌ట్టేనంటూ తెలుగు త‌మ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS Working president KTR getting confussion in keeping posts, which are now debating in telangana. ktr who goes with with jet speed on opposition, has been disturbed in the tweets.netizens questions regarding Globareena also kept ktr into confussion.Netizens discussing on the same issue in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more