• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుష్మ మరణం పట్ల పాక్ పౌరుడి కరుకు వ్యాఖ్యలు..! మిస్సైల్ లాంటి జవాబిచ్చిన కేటీఆర్ ..!!

|

న్యూఢిల్లీ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆమె మరణం పట్ల ఓ పాకిస్తాన్ ధౌర్బాగ్యుడు ట్విట్టర్ వేదికగా దారుణ వ్యాఖ్యలు చేసాడు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పాకిస్థానీ నెటిజెన్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను అప్ లోడ్ చేశారు.

ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్థానీ నెటిజెన్.... దారుణ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని... ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే... మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని అన్నారు. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని ట్వీట్ చేశారు.

 పాక్ పౌరులకు సుష్మ వైద సాయం..! ప్రశంసించిన పాకు యువత..!!

పాక్ పౌరులకు సుష్మ వైద సాయం..! ప్రశంసించిన పాకు యువత..!!

ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో కొంత మందికి వైద్య సహాయం చేసి ఆదేశ పౌరుల ప్రాణాలు కాపాడారు సుష్మ స్వరాజ్. అప్పుడు పాకిస్తాన్ లోని కొంత మంది పౌరులు సుష్మ స్వారాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తాన్ పౌరుల పట్ల దేవతగా వెలిసారంటూ పాక్ యవకులు కొందరు సుష్మ స్వరాజ్ ను కొనియాడారు. ఇదే అంశం అక్కడ కొంత వివాదానికి దారి తీసింది. ఐతే గతంలో సుష్మ స్వరాజ్ ను పొగిడిన పాక్ యువతే ఇప్పుడు ఆమె మరణం సందర్బంగా అనుచిత వాఖ్యలు చేయండం ఎంతవరకు సమంజసమని భారత యువత ప్రశ్నిస్తోంది. సుష్మ మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి వినూత్నంగా స్పందించారు.

సుష్మాస్వరాజ్‌ మృతిపై సంతాపం..! ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయానన్న పాక్‌ మంత్రి..!!

సుష్మాస్వరాజ్‌ మృతిపై సంతాపం..! ట్విటర్‌ ఫైటర్‌ను కోల్పోయానన్న పాక్‌ మంత్రి..!!

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరణం పట్ల పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్‌ చౌద్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా హఠాన్మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. 'ట్విటర్‌లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయాను. హక్కుల కోసం పోరాటే గొప్ప దిగ్గజం ఆమె. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను' అని ఫవాద్‌ చౌద్రీ ట్వీట్‌ చేశారు. ట్వీట్ల పోరాటంలో సమఉజ్జీని కోల్పోయానని పాక్ మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు.

సాహసోపేత మహిళ..! సుష్మ ధైర్యసాహసాలకు మారుపేరన్న ఫవాద్..!!

సాహసోపేత మహిళ..! సుష్మ ధైర్యసాహసాలకు మారుపేరన్న ఫవాద్..!!

కాగా పాకిస్తాన్‌లో హిందూ బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించిన వ్యవహారంపై సుష్మాకు, ఫవాద్‌ చౌద్రీల మధ్య అప్పట్లో ట్వీటర్‌లో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఘటనపై సమాచారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని ఇండియన్‌ కమిషనర్‌ను సుష్మా ఆదేశించారు. దీనిపై ఫవాద్‌ చౌద్రీ స్పందిస్తూ, 'ఇది పాక్‌ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్‌ పాలనలోని కొత్త పాక్‌. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం'. అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ, 'ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది' అని ట్వీట్‌లో బదులిచ్చారు.

తారతమ్యాలు లేని నాయకురాలు..! రాజకీయాల్లో ఆమె ఎప్పటికి ప్రత్యేకమేనన్న మంత్రి..!!

తారతమ్యాలు లేని నాయకురాలు..! రాజకీయాల్లో ఆమె ఎప్పటికి ప్రత్యేకమేనన్న మంత్రి..!!

సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ను వేదిగా చేసుకుని పలు సమస్యలకు పరిష్కారం చూపారు. ఎవరైనా ట్వీట్ ద్వారా ఆమెకు ఏదైనా సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేవారు. సుష్మా స్వరాజ్ విదేశాంగశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తనదైన పనితీరుతో ప్రత్యేక ముద్రవేశారు. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చి పలువురి అభినందనలు అందుకున్నారు. సుష్మా ఎటువంటి తారతమ్యాలు లేని రీతిలో సేవలు అందించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

English summary
Former chief minister and former union minister Sushma Swaraj had died of a blurring of heart attack on Tuesday. And a Pakistani Dhaurbagya was on Twitter to make a dreadful comment on her death. In response, TRS working President Ketiar replied sharply to the Pakistani netizen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X