హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్ సూచన: మేయర్‌కు డిప్యూటీ వంగి నమస్కారం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ప్రకటించారు. మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌ను ప్రకటించారు.

బొంతు రామ్మోహన్ చర్లపల్లి నుంచి, ఫసియుద్దీన్ బోరబండ నుంచి విజయం సాధించారు. వీరి ఎన్నిక కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ల పేర్లను ప్రకటించిన అనంతరం మంత్రి కెటి రామారావు మాట్లాడారు.

పూర్తిస్థాయిలో ప్రజలు మనకు మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని చెప్పారు. ప్రజా సమస్యల పైన కార్పోరేటర్లు దృష్టి సారించాలని చెప్పారు. నెలలోపు స్టాండింగ్ కమిటీలను నియమించుకుందామని, వచ్చే మూడు నెలల్లో జిహెచ్ఎంసి పదవులు భర్తీ చేస్తామన్నారు.

అంతకుముందు, తెరాస పార్టీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యుల సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కె కేశవ రావు, మంత్రి కేటీఆర్‌తో పాటు నగర మంత్రులు హాజరైయ్యారు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ పేరును మంత్రి జగదీష్‌రెడ్డి ప్రతిపాదించారు. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ హాల్ ఉదయం 11 గంటలకు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, అభ్యర్థులను ప్రకటించిన అనంతరం తెరాస కార్పోరేటర్లు జిహెచ్ఎంసి కార్యాలయానికి బయలుదేరారు.

మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఎన్నిక

గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఎన్నికయ్యారు. మన్నె కవిత మేయర్‌గా బొంతును ప్రతిపాదించగా, మీర్‌పేట్ కార్పోరేటర్ అంజయ్య బలపర్చారు. డిప్యూటీగా ఫయాజుద్దీన్ ఎన్నికయ్యారు. శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. కార్పోరేటర్లతో కలెక్టర్ రాహుల్ బొజ్జా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు.

అంతకుముందు తెలంగాణ భవన్లో బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ మేయర్‌గా అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తామని, నగరంలోని అన్ని రకాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి పాటుపడతానన్నారు. అంతకుముందు తెరాస కార్పొరేటర్లకు కేటీఆర్ అల్పాహార విందు ఇచ్చారు.

మేయర్, డిప్యూటీ

మేయర్, డిప్యూటీ

హైదరాబాద్ నగర మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీగా ఫసియుద్దీన్ ఎన్నికయ్యారు. గురువారం జిహెచ్‌ఎంసి కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో కొత్త కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ ప్రమాణస్వీకారం చేయించారు.

ఫసియుద్దీన్

ఫసియుద్దీన్

డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషు కుమారి ప్రతిపాదించారు. రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు.

ఫసియుద్దీన్

ఫసియుద్దీన్

డిప్యూటీ మేయర్‌గా మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించారు.

మజ్లిస్ మద్దతు

మజ్లిస్ మద్దతు

ఇరువురికి మజ్లిస్ కూడా మద్దతు తెలిపింది. కార్యక్రమం అనంతరం కొత్త మేయర్‌తో పలువురు సెల్ఫీ తీసుకున్నారు.

మేయర్

మేయర్

మేయర్‌గా బొంతు రామ్మోహన్ పేరును కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను మీర్‌పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. వేరే పేర్లు ప్రతిపాదనకు రాకపోవడంతో రామ్మోహన్ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.

మేయర్, డిప్యూటీ

మేయర్, డిప్యూటీ

ఆది నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ముఖ్యమంత్రి కెసిఆర్ వెన్నంటి ఉన్న బొంతు రామ్మోహన్ పేరు మేయర్ పదవికోసం మొదటి నుంచి ప్రముఖంగా వినిపించింది.

కెటిఆర్

కెటిఆర్

పూర్తిస్థాయిలో ప్రజలు మనకు మెజార్టీ ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని మంత్రి కెటిఆర్ అంతకుముందు తెలంగాణ భవన్లో తమ పార్టీ కార్పోరేటర్లకు హితవు పలికారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రజా సమస్యల పైన కార్పోరేటర్లు దృష్టి సారించాలని కెటిఆర్ చెప్పారు. నెలలోపు స్టాండింగ్ కమిటీలను నియమించుకుందామని, వచ్చే మూడు నెలల్లో జిహెచ్ఎంసి పదవులు భర్తీ చేస్తామన్నారు.

నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీ కార్పోరేటర్లు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి నాయిని నర్సింహా రెడ్డి

English summary
KTR names Mayor and Deputy Mayor names in Telangana Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X