• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేటీఆర్ ఇప్పుడిలా.. 60 ఏళ్లకు అలా.. కొత్త ఫోటో నెట్టింట చక్కర్లు..!

|

హైదరాబాద్ : మొన్నోసారి కేటీఆర్ నయా లుక్ అంటూ ఓ ఫోటో అదిరిపోయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. క్లీన్ షేవ్‌తో తళుక్కుమని మెరిసే తారకరాముడు మీసం, గడ్డంతో కొత్త గెటప్‌లో కనిపించారు. ఆ ఫోటో చూసి ఆయన ఫ్యాన్స్, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎంతో సంబరపడ్డారు. అదలావుంటే తాజాగా కేటీఆర్‌కు సంబంధించిన మరో ఫోటో వైరల్‌గా మారింది. అందాల తారకరాముడు 60 ఏళ్ల వయసులో ఎలా ఉంటారనేది ఆ ఫోటో చెప్పేస్తోంది. ఫేస్ యాప్ ఫాలో అయ్యారో లేదంటే ఇంకేదైనా టూల్ వాడి ఆయన ఫోటోను ఇలా చేశారో తెలియదు గానీ.. మొత్తానికైతే ఆ వయసులోనూ అందాల తారకరాముడి అందం ఏమాత్రం తగ్గలేదని కామెంటుతున్నారు కొందరు నెటిజన్లు.

 మొన్న, నిన్న, అప్పుడు.. కేటీఆర్ లుక్స్

మొన్న, నిన్న, అప్పుడు.. కేటీఆర్ లుక్స్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నయా లుక్స్ అదరగొడుతున్నాయి. మొన్నటికి మొన్న మీసం, గడ్డంతో ఉన్న ఫోటో వైరల్ కాగా.. ఇప్పుడు ఆయన మరో ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. క్లీన్‌షేవ్‌తో చిరుదరహాసం ఒలకబోసే కేటీఆర్.. మీసం, గడ్డంతో ఎలా ఉంటారనే కాన్సెప్ట్‌తో ఓ అభిమాని ఫేస్ యాప్‌తో ఆయన ఫోటో కొత్తగా క్రియేట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయింది.

ఫేస్ యాప్ ద్వారా కేటీఆర్ పూర్తి గెటప్ మార్చేశారు సదరు అభిమాని. ఇంకేముంది ఫోటో బాగా వచ్చేసరికి దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కేటీఆర్‌కు ట్యాగ్ పెట్టారు. అది చూసిన తారకరాముడు పాజిటివ్‌గానే స్పందించారు. థ్యాంక్స్ "నాట్ బ్యాడ్" అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఈ ఫోటోను ట్విట్టర్ పోస్టులో గాకుండా సెపరేటుగా చూసినోళ్లు మాత్రం పరేషాన్ అవుతున్నారట. కేటీఆర్ ఒరిజినల్ గెటప్ కన్నా.. ఈ గెటప్‌లోనే బాగున్నారంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారట.

పోలీస్ స్టేషన్లకు డిజిటల్ రూపం.. ఫిర్యాదు చేయడం ఇక ఈజీ..!

60 ఏళ్ల వయసులోనూ..! అందగాడే మా అన్న అంటూ..!

60 ఏళ్ల వయసులోనూ..! అందగాడే మా అన్న అంటూ..!

మొన్నటివరకు ఆ ఫోటో బాగా వైరల్ ఐతే.. తాజాగా కేటీఆర్ మరో ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. 60 ఏళ్ల వయసులో కేటీఆర్ ఎలా ఉంటారనేది ఆ ఫోటో సారాంశం. యంగ్ ఏజ్‌లో ఎంత అందంగా కనపడుతున్నారో.. ఆ వయసులోనూ ఆయన అందానికి వచ్చిన ఢోకా ఏమి లేనట్లుగా ఉంది ఆ ఫోటో. అయితే సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్సేమో అన్న ఎప్పుడూ అందగాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు సింహం ఎప్పుడైనా సింహమే అంటూ మరికొందరు కామెంటుతున్నారు. మొహం మీద కాస్తా ముడతలు తప్ప ఇప్పుడు అప్పుడు ఆయన సేమ్ ఉంటారనే కామెంట్లకు కూడా కొదవ లేదు.

 2016లో కూడా ఓసారి ఇలాగే..!

2016లో కూడా ఓసారి ఇలాగే..!

అదలావుంటే 2016లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సడెన్లీ కొత్త రూపంలో దర్శనమిచ్చారు. ఎప్పుడూ జుట్టును పైకి దువ్వే తారకరాముడు సైడుకు దువ్వి ప్రత్యేకంగా కనిపించారు. గ్రేటర్ ఎన్నికల వేళ అలా స్టైలిష్‌గా కనిపించిన కేటీఆర్ అందర్నీ ఆకట్టుకున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బంజారాహిల్స్ లోని తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో అలా కొత్తగా కనిపించి అదుర్స్ అనిపించారు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తండ్రి కేసీఆర్ లాగే ఆయన కూడా సైడుకు దువ్వి ఆశ్చర్యపరిచారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A photo of the TRS Working President KTR new look viraled. The glittering star with a clean shave appeared in the new getup with a mustache and beard. His fans and the TRS party cadre were very impressed with that photo. This is why another photo of KTR recently went viral. The photo tells how the beauty star turned 60 years old. Some netizens are saying that the beauty of the beauty star did not diminish at that age.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more