హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలోని బార్బర్ షాపులన్ని ప్రభుత్వ ప్రచార కేంద్రాలుగా మారాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం చిక్కడపల్లిలోని నాయీ బ్రాహ్మణుల కల్యాణమండపంలో నిర్వహించిన నాయీ బ్రాహ్మణుల కృతజ్ఞతా సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్బర్ షాపులకు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను రద్దు చేయాలని 30 ఏళ్లుగా ప్రాధేయపడుతున్నా గత పాలకులు విస్మరించారని, ఈ సమస్యను తమ ప్రభుత్వం 19 నెలల్లోనే పరిష్కరించిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్


తక్కువ సమయంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశామని, ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం, సింగరేణి కార్మికులకు 22శాతం ఫిట్‌మెంట్ ప్రకటించామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టామన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, అంగన్‌వాడీలకు, హోంగార్డులకు, రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు వేతనాల పెంచామన్నారు.

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్


దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ విపక్షాలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన పాపాలను కడిగేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 20 నెలల సమయం సరిపోదని, దశల వారీగా అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులకు తొలిసారి రాజకీయ ప్రాతినిథ్యం కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

 ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్


జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో నాయీ బ్రాహ్మణులకు రెండు కార్పొరేటర్ టికెట్లను ఇచ్చిందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులందరూ ఏకతాటిపైకి వచ్చి వారిని అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రకటించలేని పరిస్థితి ఉందని చెప్పారు.

 ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్


హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్‌తో చర్చించి నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధానాల సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రతి పల్లే తిరిగిన కేసీఆర్ ప్రజల కష్టాలను స్వయంగా చూశారని, అందుకే అడగకముందే అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు.

 ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

ప్రచార కేంద్రాలుగా బార్బర్ షాపులు: మంత్రి కేటీఆర్

అడగకముందే ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు అన్నం పెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌రావు నాయీ, లింగం నాయీ, గడ్డం మద్దు నాయీ, పది జిల్లాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
KTR promises development of Nayee Brahmin community in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X