వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40 ఏళ్లు కొట్లాడుకొని ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేందుకు: కేటీఆర్, 100 సీట్లు గెలుస్తాం: తలసాని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నలభై ఏళ్లుగా కొట్లాడుకున్న వాళ్లు ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించడానికి ఏకమయ్యారని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు బుధవారం అన్నారు. కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లకు ఓట్లు వేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని చెప్పారు. చనిపోయిన వారి పేర్లతో కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేశారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఆగం ఆగం కావొద్దని హితవు పలికారు.

Recommended Video

Telangana Assembly Elections 2018 : బాబు-రాహుల్ భేటీ పై కేటీఆర్ ట్వీట్ పంచ్ | Oneindia Telugu

<strong>టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?</strong>టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?

100కు పైగా సీట్లు గెలుస్తాం

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకే దొంగల కూటమే మహాకూటమిగా అవతరించిందని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాకూటమి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

KTR questions alliance of TDP and Congress Party alliance

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వందకు పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

ఇప్పుడు చేస్తారా?

అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వాళ్లు ఇప్పుడు అధికారం ఇస్తే చేస్తామని చెప్పడం విడ్డూరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని చెప్పారు. సమైక్య పాలనలో అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని చెప్పారు. ఇలాంటి సమయంలో అణచి వేయడానికి మళ్లీ కుట్రలు జరుగుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరున్నర దశాబ్దాలుగా చేయలేదన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao on Wednesday questioned over Telugudesam party and Congress Party alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X