వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం .. సాంగ్ రిలీజ్ చేసిన కేటీఆర్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం అని అభివర్ణించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో సాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. గత పాలకులు చేయలేని పనులను .. ఐదేళ్లలోనే చూసి చూపించామని పేర్కొన్నారు.

జలసిరులే ..
కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. ఈ ప్రాజెక్టుతో హఐదరాబాద్ సహా మిగతా నగరాలు ,పల్లెలకు 40 టీఎంసీల మంచినీరు అందనుంది. దీంతోపాటు పరిశ్రమలకు కూడా 16 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా నీటిని రైతులకు అందిస్తారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ప్రాజెక్టుపై రూపొందించిన ప్రత్యేక పాటకు కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ktr release kaleshwaram song

మానస పుత్రికే ...
కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని పోల్చారు కేటీఆర్. ఈ ప్రాజెక్టుతో వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, మత్స్యశాఖ, పర్యాటక రంగ అభివృద్ధి చెందుతుందని అభిలషించారు. అలాగే జీవ వైవిధ్యం కూడా సాధ్యమవుతుందని అంచనా వేశారు. శుక్రవారం జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరణకు ఏపీ సీఎం జగన్‌ను .. సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ సర్కార్ కొలువుదీరాక .. కేసీఆర్ ఇచ్చి పుచ్చే ధోరణితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
TRS Working President KTR described kaleshwaram is our pride. The state is facing irrigation problems. What the past rulers could not do .. Within five years, we were shown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X