వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్, మైక్రోసాఫ్ట్‌లపై ప్రభావమా, ధ్వంసం చేస్తారా: ఆ పత్రికపై ఊగిపోయిన కేటీఆర్

ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కాం, గూగుల్, మైక్రోసాఫ్ట్, లాంకో వంటి సంస్థలు ప్రభావితం అంటూ ఓ కథనాన్ని రాసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కాం, గూగుల్, మైక్రోసాఫ్ట్, లాంకో వంటి సంస్థలు ప్రభావితం అంటూ ఓ కథనాన్ని రాసింది. దీనిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.

<strong>మోడీ ప్రభుత్వానికి కేటీఆర్ ట్వీట్</strong>మోడీ ప్రభుత్వానికి కేటీఆర్ ట్వీట్

ఇటీవల మియాపూర్‌లో పెద్ద ఎత్తున భూకుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై ఆంగ్ల పత్రిక కథనం రాసింది. భూ కుంభకోణాల వల్ల హైదరాబాద్ వచ్చే కీలక సంస్థలపై ప్రభావం పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ పత్రిక ఇంతే..

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ పత్రిక ఇంతే..

రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే కోర్టుల్లో విచారణ జరుపవచ్చు లేదా ఎన్నికల్లో చిత్తుగా ఓడించవచ్చనని, కానీ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియా అవినీతిలో కూరుకుపోతే అది దేశ ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కథనం నిరాధారమైన కట్టుకథ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఎకనామిక్ టైమ్స్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముందు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలను వండివార్చుతున్నదని కేటీఆర్ ఆరోపించారు.

మీడియా.. తెలంగాణ విషయంలో ఎన్నో ప్రశ్నలు

మీడియా.. తెలంగాణ విషయంలో ఎన్నో ప్రశ్నలు

కేటీఆర్ మాట్లాడుతూ.. మన దేశంలో ప్రసార మాధ్యమాలను ఎంతగానో గౌరవిస్తామని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా అభివర్ణిస్తామని, ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ స్వేచ్ఛను సంచలనాలకోసం వాడుకుంటూ సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్వేచ్ఛాయుత సంచలనాత్మక ధోరణికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? బాధ్యత, జవాబుదారీతనం మొదలయ్యేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈ ప్రశ్నలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు, ద్వేషపూరిత కథనాలకు ఉద్యమ సమయంలో తెలంగాణ బాధితురాలు అన్నారు.

నిందలు.. కానీ హైదరాబాదులోనే దిగ్గజ సంస్థలు

నిందలు.. కానీ హైదరాబాదులోనే దిగ్గజ సంస్థలు

తెలంగాణపై ఉద్యమ సమయంలోను నిందలు వేశారని, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారని, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని జోస్యం చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ రోజు తెలంగాణ అన్నింటా దూసుకెళ్తోందన్నారు. ఐటీ ఎగుమతుల్లో దేశీయ సగటుకంటే రాష్ట్ర సగటు అధికంగా నమోదైందని, తలసరి ఆదాయం విషయానికి వస్తే దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కిందన్నారు. ప్రపంచంలోనే పేరెన్నిక గల ఐదు దిగ్గజ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లోనే కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, అమెజాన్, ఉబర్, సేల్స్‌ఫోర్స్, బోయింగ్, డీబీఎస్, జెడ్‌ఎఫ్ వంటివి నగరానికి వచ్చాయన్నారు. గత రెండేళ్లలో చారిత్రాత్మక, విప్లవాత్మకమైన విధానం టీఎస్ ఐపాస్ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తున్నది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్త రాష్ట్ర ప్రభుత్వ డైనమిజాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

డబ్బులు తీసుకొని రాస్తున్నారని సంచలన ఆరోపణ

డబ్బులు తీసుకొని రాస్తున్నారని సంచలన ఆరోపణ

కొత్త పరిశ్రమలను తీసుకురావడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఉద్యోగితను పెంపొందించడానికి కొత్త రాష్ట్రం అహర్నిశలు శ్రమిస్తుంటే కొన్ని మీడియా సంస్థలు డబ్బులు తీసుకుని కథనాలు రాయడం ద్వారా రాష్ట్రానికి మకిలి అంటించే ప్రయత్నాలు చేస్తున్నాయని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. ఇదే క్రమంలో, ఇటీవల ఎకనామిక్ టైమ్స్ తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కామ్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు ప్రభావితం అనే కథనాన్ని ప్రచురించడం ద్వారా సంచలనాత్మక జర్నలిజంలో మరింత నీచానికి దిగజారిపోయిందని, ఈ కథనంలో పేర్కొన్న ఉదంతాలన్నీ తెలంగాణ ఆవిర్భావానికంటే ముందువి అని, కొన్ని పదేళ్ల క్రితం చోటుచేసుకున్నవీ ఉన్నాయని చెప్పారు. కొత్త రాష్ట్రానికి ఇలాంటి సమస్యలు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించాయనేది అందరికీ తెలిసిందే అన్నారు.

అందుకే ఆ కంపెనీల పేర్లను వాడుకుంది

అందుకే ఆ కంపెనీల పేర్లను వాడుకుంది

ఆ పత్రిక కథనంలో పేర్కొన్న కుంభకోణాల్లో ఒకదానిని తమ ప్రభుత్వమే అంతర్గత ఆడిటింగ్ ద్వారా వెలికి తీసిందని కేటీఆర్ చెప్పారు. దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికే ఆ పత్రిక పత్రిక మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల పేర్లను వాడుకున్నదని మండిపడ్డారు. అదే సమయంలో ఆ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జరిగిన వ్యవహారాలను ఈ కథనంలో చొప్పించిందని, పెట్టుబడిదారుల ముందు కొత్త రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేసిందనేది తెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహించే జేఎల్‌ఎల్ (జోన్స్ లాంగ్ లసాల్), సీబీఆర్‌ఈ వంటివి ఎకనామిక్ టైమ్స్ రాసినది తప్పుడు కథనమని, కేవలం సంచలనం కోసమే ప్రచురించిందని పేర్కొన్నాయన్నారు.

ఉద్యమ సమయంలో వ్యతిరేకించినా..

ఉద్యమ సమయంలో వ్యతిరేకించినా..

కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ఉద్యమంపై తప్పుడు కథనాలు రాశాయని, ప్రసారం చేశాయని కేటీఆర్ అన్నారు. అయితే 2014లో తెలంగాణ వచ్చాక దేశంలోని చాలా పత్రికలు కొత్త రాష్ట్రాన్ని ఆమోదించాయని, తమ ద్వేషభావాన్ని పక్కన పెట్టి, తటస్థ వైఖరినో, లేదా స్తబ్దతనో అనుసరించాయని, కానీ కొన్ని పత్రికలు కొత్త రాష్ట్రం స్వేచ్ఛావాయువులను పీల్చుకోవడానికీ సమయం ఇవ్వకుండా అపవాదులను అంటగడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భవించిన నాలుగు వారాల్లోపే ఆ పత్రిక సుమారు ఏడు వందల సంస్థలు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివెళుతున్నాయనే నిరాధార కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల రోజుల క్రితం ఇలా.. వరుసగా..

నెల రోజుల క్రితం ఇలా.. వరుసగా..

నెల రోజుల్లోనే మరోసారి.. తెలంగాణలో పరిస్థితులు సానుకూలంగా లేవని ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపేలా మరో నిరాధార కథనాన్ని ప్రచురించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇలా రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే అనేక కథనాలను ఆ పత్రిక ప్రచురిస్తూనే ఉందని, గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఆ పత్రిక బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా వరుస కథనాలు రాస్తూనే ఉన్నారని, ఎప్పుడైనా ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి ఆ పత్రిక బ్యూరో చీఫ్ హాజరుకారని, ఇన్వెస్టర్ల ముందు తెలంగాణను అపహాస్యం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు ఆ పత్రిక ధోరణి కనిపిస్తోందన్నారు.

పథకం ప్రకారమే.. క్రూరమైన ఉద్దేశ్యాలు, ధ్వంసం చేస్తారా?

పథకం ప్రకారమే.. క్రూరమైన ఉద్దేశ్యాలు, ధ్వంసం చేస్తారా?

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆ పత్రిక ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ అన్నారు. వారి ఉద్దేశాలు క్రూరమైనవని, దేశంలో ఒక ముఖ్యమైన అంశంపై చర్చకు ఇవి పురికొల్పుతున్నాయని, ఒక పత్రిక ఇష్టమొచ్చినట్టు ఎలాంటి కథనాలనైనా ప్రచురించవచ్చునా? ఒక కొత్త రాష్ట్రాన్ని దాని భవిష్యత్తును ధ్వంసంచేసే దుస్సాహసానికి ఒడిగట్టవచ్చునా? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, చిత్తశుద్ధితో అది చేసే కృషిని అపఖ్యాతిపాలుచేసేందుకు డబ్బులు తీసుకుని తప్పుడు కథనాలను ప్రచురించవచ్చునా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నిజానికి.. జరిగింది జరిగినట్టుగా పత్రికలు రిపోర్ట్ చేయాలని, దానికి అభిప్రాయాన్ని జత చేయాలని, విచారించి, ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రచురించాలన్నారు. పాఠకులను పెంచుకునేందుకు సంచలన అంశాలను కూడా తీసుకోవచ్చునని, కానీ ఇతర అన్ని అంశాలూ పక్కకుపోయి సంచలనమే నిండిపోతే ఎలా అన్నారు. తెలంగాణ విషయంలో వార్తలు రాసేటప్పుడు ఆ పత్రిక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందా లేక తన పత్రికలో స్థలాన్ని పెయిడ్ ఆర్టికల్స్‌కోసం అమ్ముకుంటోందా అని నిలదీశారు.

English summary
Telangana Minister KT Rama Rao responded on 'Largest realty scam in Telangana worth Rs 15,000 crore'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X