హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిది మేకపోతు గాంభీర్యం: ముందస్తుపై కేటీఆర్, హీరోలతో సందడి చేయనున్న మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీది అందా మేకపోతు గాంభీర్యం అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. గతంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఇప్పుడు దేశానికి ధాన్య బాండాగారం తెలంగాణ అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ చెప్పారని తెలిపారు. గాంధీ చెప్పినా ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు అన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీది కుంభకోణాల చరిత్ర అన్నారు. వందమంది పోరాటయోధులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.

కమీషన్లు మోసుడు, కాంగ్రెస్ దద్దమ్మలకే తెలుసునని మండిపడ్డారు. అది తమ పార్టీకి తెలియదన్నారు. డిపాజిట్లు రావని వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము వంద సీట్లకు పైగా గెలుస్తామని చెప్పారు.

KTR responds on Uttam Kumar Reddys early elections challenge

సినిమా కార్యక్రమంలో కేటీఆర్ సందడి

ఇదిలా ఉండగా, ఓ కార్యక్రమం కోసం కేటీఆర్, రానా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండలు ఒకే వేదిక పైకి రానున్నారు. తరుణ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. ఈ చిత్రం ట్రయలర్‌ను రానా ఇటీవల విడుదల చేశారు. 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు సిద్ధమైంది. రావి నారాయణ్‌ రెడ్డి ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలుగురు వస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, కథానాయకులు రానా దగ్గుబాటి, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ వస్తున్నారు.

English summary
Telangana Minister KT Rama Rao responded on Uttam Kumar Reddy's early elections challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X